Vishwak Sen: అర్జున్ తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్.. ఏం చెప్పారంటే?

ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ వరుస విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ మొదలు కాగా దాస్ కా ధమ్కీ సినిమా తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిందని విశ్వక్ సేన్ చెబుతున్నారు. ఈ సినిమా నైజాం హక్కులు 3 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో ధమాకా దాస్ కా ధమ్కీ సినిమాల కథలు ఒకటేనని సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్ సేన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథ విషయంలో నాకే ఎక్కువ క్లారిటీ రావడంతో నేనే డైరెక్టర్ గా మారానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

దాస్ కా ధమ్కీలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నానని ఆయన తెలిపారు. ధమాకా, ధమ్కీ పోలికలపై స్పందిస్తూ ఒకే కథను ఇద్దరు కొనుక్కోవడానికి మేమేమైనా పిచ్చోళ్లమా అని విశ్వక్ సేన్ ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ ఒకే కథ ఇస్తే ఇండస్ట్రీలో ఎలా తిరుగుతాడని ఆయన తెలిపారు. ధమ్కీ రీషూట్ వార్తల్లో నిజం లేదని విశ్వక్ సేన్ అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ వల్ల రిలీజ్ డేట్ మారిందని ఆయన కామెంట్లు చేశారు. సినిమాలో 40 పీపుల్ ఫైట్ ఉంటుందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

అర్జున్ తో వివాదం గురించి స్పందిస్తూ ఆ ప్రెస్ మీట్ విషయంలో నాకూ అంతే క్వశ్చన్ మార్క్ ఉందని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. నేను ఒక్కరోజు రానని మాత్రమే చెప్పానని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నకు నేను పెద్ద ఫ్యాన్ అని తెలుసని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కాకుండా బాలయ్యను డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన తెలిపారు. డైరెక్షన్ అంటే ఏడాది సమయం కేటాయించాలని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus