Gaami Trailer Review: ‘గామి’ ట్రైలర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మధ్యనే చిన్న గ్లింప్స్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మార్చి 8న శివరాత్రి పండుగ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు కాబట్టి.. శివ భక్తులు బాగా కనెక్ట్ అవుతారని భావించి చిత్ర బృందం ఆరోజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 43 సెకన్ల నిడివి కలిగి ఉంది.

ట్రైలర్ ఆరంభంలో హీరోని ఒక అఘోరాగా, అలాగే అతనికి ఏదో సమస్య ఉన్నట్లు చూపించారు. అటు తర్వాత అతన్ని హిమాలయాల్లో త్రివేణి వద్దకు వెళ్ళమని ఆశ్రమంలో వాళ్ళు చెప్పడం.. మరోపక్క ఓ పల్లెటూరిలో దేవదాసి గురించి వెతకడం.. అటు తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కథలో చాలా సర్ప్రైజ్..లు ఉన్నాయి. అంతకు మించి ఈ ట్రైలర్లో విజువల్స్..

హాలీవుడ్ మూవీస్..ను తలపించేలా ఉన్నాయని చెప్పాలి. విశ్వనాధ్ రెడ్డి సి హెచ్, రాంపి నందిగం..ల సినిమాటోగ్రఫీ ను మెచ్చుకోవాల్సిందే. అలాగే నరేష్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ అనే చెప్పాలి. ట్రైలర్ చాలా బాగుంది. మిస్ కాకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus