విశ్వక్ సేన్ (Vishwak Sen) వయసు ఇప్పుడు 30 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు అతన్ని పెళ్లి గురించి అడిగితే.. ‘నాకు ఇంకా అంత వయసు రాలేదు వచ్చాక ఆలోచిస్తా’ అంటూ చెప్పేవాడు. సినిమా వాళ్ళు ఇలా చెప్పడం కామన్. ముఖ్యంగా హీరోలు అయితే ఇలాంటివే చెబుతారు. విశ్వక్ సేన్ సినిమాలకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. అతను ఇంకా పెళ్లి వద్దు అన్నట్లు చెబుతూ వచ్చాడు. మరోపక్క హీరోయిన్ నివేదా పేతురాజ్ తో అతను డేటింగ్లో ఉన్నాడని…,
ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడమే కాకుండా, ఖరీదైన కారు కూడా కొనుగోలు చేసి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనే టాక్ నడిచింది. ఈ విషయాలపై విశ్వక్, నివేదా..లని ఆరా తీస్తే ‘ఇవన్నీ గాసిప్స్’ అని తోసిపుచ్చారు. ఇక విశ్వక్ సేన్ లేటెస్ట్ కామెంట్స్ బట్టి.. వీళ్ళకి బ్రేకప్ అయ్యి ఉండొచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నాకు కూడా వయసు పెరుగుతుంది. వయసుతో పాటు అనుభవం కూడా వస్తుంది.
అందుకే ఇక అతి చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో మా అమ్మకి కూడా చెప్పి వచ్చాను. సంబంధాలు చూడమని..! మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడైనా రెడీ’ అన్నట్టు విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది ‘లైలా’ తో (Laila) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. దీంతో డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ‘ఫంకీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) అనుదీప్ కేవీ (Anudeep Kv) దీనికి దర్శకుడు.
మా అమ్మకి సంబంధాలు చూడమని మొన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను#HIT3 #Nani #SrinidhiShetty #SaileshKolanu #Rajamouli #VishwakSen pic.twitter.com/LzOT5mjKE2
— Filmy Focus (@FilmyFocus) April 27, 2025