కరోనా నేపథ్యంలో చాలా మంది దర్శకుడు కొత్త కథలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమా విడుదలైంది. కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా లాక్ డౌన్ నేపథ్యంలో సాగే కథ. అలానే ‘మంచి రోజులొచ్చాయి’, ‘WWW’ లాంటి సినిమాలకు కూడా కరోనాతో లింక్ ఉంది. ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అలాంటి కథనే ఎన్నుకున్నాడు.
ఇటీవల ‘పాగల్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమా చేస్తున్నాడు. ఎస్వీసీసీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. విద్యాసాగర్ చింతా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ అబ్బాయి.. అమ్మాయిని చూడడానికి పెళ్లిచూపులకు వెళ్తాడు. అదే రోజు లాక్ డౌన్ ప్రకటిస్తారు. దీంతో అబ్బాయి ఫ్యామిలీ మొత్తం అమ్మాయి ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ. సినిమా దాదాపుగా ఒకే ఇంట్లో జరుగుతుందట. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ కూడా వేశారు. ఇప్పటివరకు మాస్, యూత్ తరహా సినిమాలు చేసిన విశ్వక్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!