Vishwak Sen: శర్వానంద్..కి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?

విశ్వక్ సేన్ గత సినిమాలు ‘మెకానిక్ రాకీ’ ‘లైలా’ వంటివి తీవ్రంగా నిరాశపరిచాయి. అంతకు ముందు వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సో విశ్వక్ సేన్ కి ఇప్పుడు కచ్చితంగా ఓ హిట్టు పడాలి. లేదు అంటే అతని మార్కెట్ ఇంకా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే అతని లైనప్ ని మార్చుకుని.. కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసుకుని మరీ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ‘ఫంకీ’ చేస్తున్నాడు.

Vishwak Sen

‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2025 క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత కిశోర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి విశ్వక్ సేన్ రెడీ అయ్యాడట.ఇటీవల కథ వినడం అది విశ్వక్ కి విపరీతంగా నచ్చడంతో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది. నిర్మాత ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

‘శ్రీకారం’ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా స్ట్రాంగ్ కంటెంట్ తో వచ్చినప్పటికీ.. స్క్రీన్ ప్లేలో వర్కౌట్ కాకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా నిలబడలేదు. కానీ కిషోర్ రెడ్డి అయితే టాలెంటెడ్ అనే చెప్పాలి. మరోపక్క విశ్వక్ సేన్… తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ అనే క్రేజీ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. దాంతో పాటు సమాంతరంగా కిషోర్ రెడ్డి ప్రాజెక్టుని విశ్వక్ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus