Vishwak Sen: ఆ కారణంతోనే ‘దాస్ కా ధమ్కీ’ నేనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది: విశ్వక్ సేన్

ఓ సినిమా మేకింగ్ దశకు చేరుకున్నప్పుడు చాలా మార్పులు చోటు చేసుకోవడం సహజం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుండి ఈ సంస్కృతి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఏకంగా డైరెక్టర్లను తీసేసి మరీ హీరోలే సినిమాలను డైరెక్ట్ చేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. మిస్కిన్ ను పక్కన పెట్టేసి ‘డిటెక్టివ్ 2’ ని విశాల్ డైరెక్ట్ చేస్తున్నాడు.. అదే కోవలో విశ్వక్ సేన్ కూడా ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

నిజానికి ఈ చిత్రానికి మొదట ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడిగా ఎంపికయ్యాడు. ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు కూడా నరేష్ కుప్పిలి సగం షూట్ చేశాడు. అయితే సడన్ గా ఇతన్ని తప్పించి విశ్వక్ డైరెక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇప్పటివరకు దానికి కారణం ఏంటన్నది ఎవ్వరికీ తెలీదు. అయితే తాజాగా ఈ విషయంపై విశ్వక్ సేన్ స్పందించాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ” నిజానికి ఈ కథని ప్రసన్న కుమార్ దగ్గర్నుండి తీసుకున్నాం.

మొదట నేను డైరెక్టర్ ను కాదు. అయితే కథలో తెలీకుండానే నేను డీప్ గా ఇన్వాల్వ్ అవ్వడంతో .. ప్రతిసారి ‘ఇది ఇంకా బాగా చేయొచ్చు కదా’ అని నాకు అనిపించింది. ‘టెంపర్’ సినిమాని పూరి జగన్నాథ్ గారు ఒకలా తీస్తే రోహిత్ శెట్టి ఇంకోలా తీశారు. సో నా వెర్షన్.. డైరెక్టర్ వెర్షన్ వేరేలా ఉంది. అందుకే ‘ఈ సినిమా నేనే డైరెక్ట్ చేస్తాను. మనం ఇంకో సినిమా చేద్దాం’ అని డైరెక్టర్ కు చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus