Vishwak Sen: ఈ సినిమా కోసం సర్వం ధారపోసాను: విశ్వక్ సేన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విశ్వక్ సేన్ ఒకరు. ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈయన తాజాగా దాస్ కా ధమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమాకు ఈయనే నిర్మాత దర్శకుడు కావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలా ఎన్టీఆర్ ఈ సినిమా ఈ వెంట్ కి ముఖ్య అతిథిగా రావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కూడా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ పలు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో ముందుగా ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్టీఆర్ గారి ఇంట్లో ఒక మరణం సంభవించింది అలాంటి సమయంలో ఆయన తన సినిమా ఈవెంట్ కు వస్తారా రారా అనుకున్నాను కానీ ఎన్టీఆర్ గారు వస్తారని చెప్పడంతో నా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిందని నేను భావించాను. ఇలా ఎన్టీఆర్ గారి అభిమానుల బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం నా సర్వస్వం మొత్తం ధారపోసాను.

నేను పడిపోతే, నాశనమైపోతే చూడాలని చాలామంది అనుకుంటున్నారు కానీ ఎన్టీఆర్ గారి రాకతో ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అంటూ ఈయన ఈ సినిమా పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ద్వారా విశ్వక్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఈయనకు జోడిగా నివేదా పేతురాజు హీరోయిన్ గా నటించారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus