మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘విశ్వంభర'(Vishwambhara) అనే సినిమా మొదలైంది. ‘భోళా శంకర్’ (Bhola Shankar) తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. ‘భోళా శంకర్’ రిజల్ట్ ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. ‘బింబిసార’ (Bimbisara) తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దీనికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థపై వంశీ (Vamsi Krishna Reddy), ప్రమోద్ (Pramod Uppalapati), విక్రమ్…లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సోసియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న సినిమా ఇది. గతంలో చిరంజీవి చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా కూడా ఆ జోనర్లో చేసినదే. అందువల్ల మొదటి నుండి ఈ సినిమాపై ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ‘విశ్వంభర’ టీం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం వాయిదా వేసుకున్నారు.
తర్వాత సమ్మర్ కి అంటే మే 9న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత ప్యాచ్ వర్క్ వంటివి జరుగుతుండటం వల్ల.. ఆగస్టు 22 కి ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఫైనల్ ఔట్పుట్ ముందుగానే నిర్మాతల చేతికి వచ్చేస్తుందట. సో ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. జూన్ నెల మూడో వారానికి ఫైనల్ కాపీ వచ్చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి..
నెల రోజుల పాటు సినిమాను ప్రమోట్ చేసినా జూలై నెలాఖరుకి ‘విశ్వంభర’ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేకర్స్ జూలై 24 డేట్ ని పరిశీలిస్తున్నట్టు టాక్. అదే డేట్ కి గతంలో ‘ఇంద్ర’ (Indra) సినిమా రిలీజ్ అయ్యింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సో సెంటిమెంట్ గా కూడా కలిసొస్తుందేమో అనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. చూడాలి మరి..!