గోపీచంద్ (Gopichand) -శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో ‘విశ్వం’ (Viswam) అనే చిత్రం రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. టీజర్, ట్రైలర్ మెప్పించాయి. అక్టోబర్ 11న విడుదలైన ‘విశ్వం’కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. వీక్ డేస్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.

ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
| నైజాం | 1.41 cr | 
| సీడెడ్ | 0.52 cr | 
| ఉత్తరాంధ్ర | 0.58 cr | 
| ఈస్ట్ | 0.17 cr | 
| వెస్ట్ | 0.23 cr | 
| గుంటూరు | 0.44 cr | 
| కృష్ణా | 0.48 cr | 
| నెల్లూరు | 0.16 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.99 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.33 cr | 
| ఓవర్సీస్ | 0.30 cr | 
| వరల్డ్ వైడ్ టోటల్ | 4.62 cr | 
‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ చిత్రం రూ.4.62 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.38 కోట్ల షేర్ ను రాబట్టాలి.
