కరోనా – లాక్‌డౌన్ పరిస్థితులు సద్దుమణిగి అప్పుడప్పుడు ప్రేక్షకులు తిరిగి ధైర్యంగా థియేటర్లకు వస్తున్న రోజులవి. లాభాలు తగ్గాయనో, కరోనా నష్టాలు పూడ్చుకుందామనో సినిమా నిర్మాతలు ప్రభుత్వాల పర్మిషన్లు తెచ్చుకుని టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో చేసేదేం లేక కొంతమంది ఎక్కువపెట్టి సినిమాకొస్తే.. ఇంకొంతమంది ఓటీటీకి వస్తే చూద్దాంలే అని ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? నిజానికి ఈ మాట కొత్తదేం కాదు, ఈ విషయంలో భయపడిన నిర్మాతలు ‘తక్కువ ధరలకే సినిమా’, ‘పాత ధరలకే సినిమా’ అంటూ కొత్త నినాదాలు తెచ్చి టికెట్లు అమ్ముకున్నారు కూడా.
Naga Vamsi
ఈ విషయాలు మీకు తెలిసే ఉంటాయి. అయితే ప్రముఖ నిర్మాత నాగవంశీకి (Naga Vamsi) ఈ విషయాలు తెలియకుండా ఉంటాయా? కచ్చితంగా ఉండవు అనే చెప్పాలి. కానీ ఆయన (Naga Vamsi) తాజాగా మాట్లాడుతూ రూ.1500 పెట్టి కుటుంబం సినిమా చూస్తే తప్పేముంది అని కామెంట్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. జనాలు రోడ్లెక్కి ఆ విషయం గురించి మాట్లాడరు కాబట్టి.. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టుల రూపంలో భగ్గుమంటున్నారు.
మీకు రూ. 1500 నాలుగు టికెట్లు కావొచ్చు.. సగటు సినిమా జీవికి అది నెల రోజులకు సరిపడే బియ్య లాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. సీనియర్ నిర్మాతలు టికెట్ ధరల పెంపునకు సంబంధించి గతంలో చేసిన కామెంట్లు కూడా ఆయన చూడాల్సింది అని అంటున్నారు మరికొంతమంది. సగటు కుటుంబం మొత్తం సినిమా చూడటానికి అంత పెట్టలేకే ఓటీటీలవైపు వెళ్లిపోతున్నారు.
గతంలో అందుకే ఓటీటీల వల్ల సినిమా థియేటర్లకు లాస్ అనే చర్చ కూడా సాగింది అని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంతేసి పెడితే తప్పేముంది అని నాగవంశీ అనడం పరిశ్రమకు ఇబ్బంది కలిగించేలా ఉంది అని అంటున్నారు. అయితే ‘దేవర’ కి పెట్టిన రేట్లు, చెప్పిన ఈ మాటలు తర్వాతి సినిమాలకూ ఉంటుందా అనే ప్రశ్నించే వారూ ఉన్నారు.’