Viswam Collections: ‘విశ్వం’ 8 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

గోపీచంద్ (Gopichand)  , కావ్య థాపర్ (Kavya Thapar)  జంటగా నటించిన ‘విశ్వం’ (Viswam) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలైంది.6 ఏళ్ళ గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల  (Srinu Vaitla)  డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. తొలిరోజు ‘విశ్వం’కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫామ్లో లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. వీక్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు.

Viswam Collections

కానీ దసరాకి రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి (Viswam) 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 2.00 cr
సీడెడ్ 0.67 cr
ఉత్తరాంధ్ర 0.75 cr
ఈస్ట్ 0.29 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.51 cr
కృష్ణా 0.60 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42 cr
ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.99 cr

‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.5.99 కోట్ల షేర్ ను రాబట్టింది. ఉన్నంతలో ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.7.01 కోట్ల షేర్ ను రాబట్టాలి.

 ‘జనక అయితే గనక’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus