Prabhas: ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదు ‘రెబల్స్’.!

  • October 17, 2024 / 12:05 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఏడాది తిరక్కుండానే 3 సినిమాలు విడుదల చేసి చరిత్ర సృష్టించాడు. స్టార్ హీరోలు రెండేళ్ళకి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏకంగా 3 సినిమాలతో ప్రేక్షకులను అలరించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. అవే ‘రాజాసాబ్’ ‘ఫౌజీ’ వంటి సినిమాలు. త్వరలోనే ‘స్పిరిట్’ (Spirit) కూడా స్టార్ట్ కానుంది. ఈ ఏడాది చివర్లో.. అంటే డిసెంబర్ నాటికి ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Prabhas

‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్ ప్లే చేస్తాడని తెలుస్తుంది. గతంలో ‘బిల్లా’ ‘బాహుబలి’ వంటి చిత్రాల్లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడు. కానీ ఇప్పుడు చేస్తుంది డబుల్ రోల్. అంటే ఒకేసారి ఇద్దరు ప్రభాస్..లు కనిపిస్తారన్న మాట.

ఇకపోతే ఇందులో ఒకటి మిడిల్ ఏజ్డ్ రోల్ అని తెలుస్తుంది. ఆ పాత్రకి జోడీగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ కనిపించనుందట. అలాగే విలన్ గా ఓ సీనియర్ స్టార్ హీరో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విలన్ పాత్రకి సెట్ అయ్యే సీనియర్ స్టార్ హీరో కోసం గాలిస్తున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉంది. కాబట్టి.. దానికి ముందు రోజు..లేదా ఆ రోజున ‘స్పిరిట్’ ప్రాజెక్టు గురించి ఒక అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బాలకృష్ణపై అంత పెడుతున్నారా.. చిన్న విషయం కాదుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus