Viswanath, Jr NTR: ఎన్టీఆర్ నటనకి ఫిదా అయిపోయిన విశ్వనాథ్..!

ఈ మధ్య ఏంటో కానీ… సినీ పరిశ్రమకు చెందిన పెద్ద వయసు ఉన్నవాళ్ళంతా ఎన్టీఆర్ ను తెగ పొగిడేస్తున్నారు. ఈ మధ్యనే సీనియర్ స్టార్ నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ గొప్ప నటుడు అని.. అద్భుతంగా డైలాగులు చెబుతాడు, డ్యాన్స్ లు చేస్తాడు, అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటాడు, పెద్ద ఎన్టీఆర్ ను కూడా మరిపిస్తాడు. అతనిలో ఉన్న పొటెన్షియాలిటీ మరే హీరోలోనూ చూడలేదు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

కాకపోతే చంద్రమోహన్ లా అతను కూడా పొట్టోడు అని కోటా అన్నారు. ఆయన కామెంట్స్ ఇంకా వైరల్ అవుతూ ఉండగానే.. ఇప్పుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు కూడా ఎన్టీఆర్ ను తెగ పొగిడేస్తూ కామెంట్లు చేశారు. ఆయన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చూశారట. అందులో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనపరిచాడు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కొమరం భీముడో పాటలో అయితే ఎన్టీఆర్ నటనకి, హావ భావాలకి ఫిదా అయిపోయినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

Dadasaheb Phalke Award to k.vishwanath, K.Viswanath, K.Viswanath Movies,

సినిమా చూసిన వెంటనే ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరీ ఆయన అభినందించారట. విశ్వనాథ్ గారు వంటి గొప్ప దర్శకులు, నటులు పొగడడం అంటే మాములు విషయం కాదు. ఎన్టీఆర్ ఆయన కంట్లో పడ్డాడు. ఫ్యాన్స్ కు అంతకన్నా ఏం కావాలి. విశ్వనాథ్ గారి సినిమాల్లో నటీనటులు ఎంత గొప్పగా నటిస్తారో సంగతే.

Komuram Bheemudo Song From RRR Movie

ఇప్పటికైనా ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ ను తక్కువ చేశారు అని బాధపడడం ఎన్టీఆర్ అభిమానులు మానేస్తే బెటర్. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus