సోషల్ మీడియా విప్లవం తరువాత మొదలైన కొత్త ట్రెండ్ మీమ్స్, ట్రోల్స్. వీటిని బాగా ఎంజాయ్ చేసే నెటిజెన్స్ ఉన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, సినిమాలను ఉద్దేశిస్తూ చేసే ట్రోల్స్ చాలా ఫన్ పంచుతాయి . ఐతే ట్రోల్స్ చాలా సంధర్భాలలో హద్దులు దాటేస్తూ ఉంటాయి. సెలబ్రిటీలను ఉద్దేశించి చేసే ఈ ట్రోల్స్ వారిని మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియా సెటైర్స్, ట్రోల్స్ కి తానూ చాలా మానసిక వేదనకు గురైనట్లు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న వితిక షేరు వివరించారు.
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక తనపై పుట్టుకొచ్చిన ట్రోల్స్ ఎంతో బాధపెట్టాయంట. తనలోని ఆత్మ స్థైర్యాన్ని అవి దెబ్బ తీశాయి అట. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ తనను మానసికంగా చాలా వేదనకు గురిచేసినట్లు ఆమె చెప్పు కొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా వితికను టార్గెట్ చేస్తూ వచ్చే మీమ్స్ కి చాలా ఇబ్బంది పడేవారట. ఒక దశలో చనిపోవాలన్నంత భాధ వేసిందట. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక మూడు వారాలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.
తన స్నేహితులు కూడా తనను పట్టించుకోవడం మానేశారట. దీనితో ఆమె కుటుంబానికి దగ్గరయ్యారట. కఠిన పరిస్థితులలో కుటుంబం తనకు అండగా నిలిచిందని, అప్పుడు కుటుంబం విలువ తెలిసినట్లు ఆమె చెప్పారు. దాదాపు 13వారాలు వితిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగారు. బిగ్ బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేసిన మొదటి భార్యాభర్తలుగా వితిక, వరుణ్ సందేశ్ ఉన్నారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!