Vivek Agnihotri, Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన వివేక్ అగ్నిహోత్రి.. అలా క్లారిటీ ఇస్తూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ప్రభాస్ ఎవరినీ పల్లెత్తు మాట అనకపోయినా కొంతమంది మాత్రం ప్రభాస్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి తాజాగా ప్రభాస్ ను విమర్శిస్తూ కామెంట్లు చేశారంటూ కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వివేక్ అగ్నిహోత్రి మాత్రం తాను ఆ కామెంట్లు చేయలేదని వెల్లడించారు. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన వివేక్ అగ్నిహోత్రి తనదైన శైలిలో ప్రభాస్ అభిమానులు కూల్ అయ్యేలా వివరణ ఇచ్చారు.

ఇలాంటి అసత్యాలు ఏ విధంగా పుట్టుకొస్తున్నాయో నాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. భారీ బడ్జెట్ సినిమాలను తీసే ప్రభాస్ ను తాను ఎంతగానో గౌరవిస్తానని వివేకా అగ్నిహోత్రి వెల్లడించారు. అర్థంపర్థం లేని ఫేక్ స్టేట్ మెంట్లను ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము చిన్న బడ్జెట్ లో ప్రజల కోసం సినిమాలు చేస్తున్నామని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ప్రభాస్ కు తమకు పోలిక ఏంటని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. వివేక్ అగ్నిహోత్రి కామెంట్లతో ప్రభాస్ అభిమానులు ఇప్పటికైనా కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనేలా ఉండటంతో పాటు డైలాగ్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

సలార్ సినిమా సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాకు సీక్వెల్ లేదని నాగ్ అశ్విన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus