శ్రీముఖి కోసం ఏకంగా థియేటర్లో ప్రమోషన్లు చేస్తున్నారు..!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ ఇక ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. దీంతో హౌస్ లో ప్రతీ ఒక్కరు కసిగా గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ వారం హౌస్ లో ఉన్న 7 మెంబెర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారంలో ఒకరు.. తరువాత వారంలో మరొకరు ఎలిమినేట్ అవుతారు. దీంతో ‘టాప్ 5’ ఎవరు అనేది డిసైడ్ అయిపోతుంది. ఇక ఈ రెండు వారాలు బాగా కీలకం కాబట్టి.. బయట ఈ కంటెస్టెంట్ ల ఫ్యాన్స్ కూడా గట్టిగా ప్రమోషన్ చేస్తున్నారు.

ఇక హౌస్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ ఎవరంటే.. శ్రీముఖి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వారం ఈమె కూడా నామినేషన్స్ లో ఉంది. దీంతో ఈమె అభిమానులు శ్రీముఖికి ఓట్లు వేయాలంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ అలా ఇలా కాదు… ఏకంగా థియేటర్లలో యాడ్స్ వేసి మరీ ప్రమోట్ చేస్తున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ను ఫైనల్ కు చేర్చాలని ఇలా తెగ కష్టపడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం పై శ్రీముఖి ను అలాగే ఆమె అభిమానుల్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఇది పిచ్చికి పరాకాష్ట’, ‘శ్రీముఖి కన్నింగ్.. ఆమెకు ఓట్లు ఎవరు వేస్తారు’, ‘ఇంత పెద్ద రేంజ్ లో శ్రీముఖికి ప్రమోషన్ చేయడం డబ్బులు వేస్ట్’, ‘ఇలా చేస్తే వచ్చే ఓట్లు కూడా రావు’ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus