MAA Elections: ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారంటూ కొట్టుకుంటున్న ఆర్టిస్టులు!

ఎప్పుడో అయిదేళ్ళకోసారి వచ్చే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే, అది కూడా చాలా అరుదుగా “రిగ్గింగ్” అనే మాట వింటూ ఉంటాం. బైఎలక్షన్స్ టైంలో కూడా ఈ రిగ్గింగ్ గట్రా గురించి ఇంత హడావుడి జరగదు. కానీ.. ఇవాళ హైద్రాబాద్ లోని ఫిలిమ్ ఛాంబర్ లో జరుగుతున్నా మా ఎలక్షన్స్ మాత్రం “రిగ్గింగ్” కారణంగా ఓటింగ్ ను కొంతసేపు ఆపుజేయాల్సి వచ్చింది. మంచు విష్ణు ప్యానల్ & ప్రకాష్ ప్యానల్స్ కు చెందిన శివబాలాజీ, సమీర్ లు రిగ్గింగ్ జరిగిందంటూ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ.. కొట్టుకునేదాకా వచ్చారు.

ఆఖరికి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఒకే చేస్తే తప్ప ఓటింగ్ మళ్ళీ మొదలవ్వలేదు. తిప్పికొడితే సరిగ్గా 200 ఓట్లు కూడా పడని సమయంలో రిగ్గింగ్ అంటూ ఇరు వర్గాలు తిట్టుకోవడం హాస్యాస్పదంగా మారింది. చిన్నపాటి మా ఎలక్షన్స్ కు ఇంత హడావుడి అవసరమా అని అందరూ నవ్వుకునేలా చేసింది. సాయంత్రం వెలువడనున్న ఫలితాల్లో ఎవరు విజయం సాధిస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికి వీరి చర్యలు మాత్రం కామెడీగా ఉన్నాయి.

ఇక ఈ ప్యానల్స్ గాలిచాక ఏమేరకు ఉపయోగపడతాయి, ఆర్టిస్టులకు ఎంతమేరకు సహాయం చేస్తాయి అనేది తెలియదు కానీ.. ఈ హడావుడి మాత్రం హేయంగా ఉంది. ఇదే సందర్భంలో బెనర్జీని మోహన్ బాబు చంపేస్తానంటూ బెదిరించడం మరో విశేషం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus