‘ఛత్రపతి’ తో స్టార్ డంని సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ ‘పౌర్ణమి’ ‘యోగి’ వంటి చిత్రాలు చేసాడు. వీటిలో ‘పౌర్ణమి’ ప్లాప్ అయ్యింది. ఇక ‘యోగి’ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఈ మూవీలో ప్రభాస్ ను దర్శకుడు వి.వి.వినాయక్ ప్రెజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంత మాస్ గా.. రాజమౌళి కూడా ప్రభాస్ ను ప్రెజెంట్ చేయలేదు అని అభిమానులు అనుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు.
ఇంట్రడక్షన్ సీన్ కానీ, గాజుల ఫైట్ సీన్, కారం ఫైట్ సీన్లను ఓ రేంజ్లో తీర్చిదిద్దారు వి.వి.వినాయక్. 2007 వ సంవత్సరం జనవరి 12న విడుదలైన ‘యోగి’ మూవీ 2005 లో వచ్చిన కన్నడ మూవీ ‘జోగి’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో ఇంత మాస్ ఎలిమెంట్స్ ఉండవు. అయితే ‘యోగి’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవడానికి ఓ చిన్న తప్పు కారణం అన్నారు దర్శకుడు వినాయక్.
వినాయక్ మాట్లాడుతూ.. ” ‘ఠాగూర్’ సినిమా ‘రమణ’ కి రీమేక్. అయితే ఆ మూవీ క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. నేను తెలుగుకి వచ్చే సరికి ఆ క్లైమాక్స్ ను మార్చాను. దాంతో ఆ మూవీ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ‘జోగి’ మూవీకి కూడా నేను ‘ఠాగూర్’ రిఫెరెన్స్ తీసుకోవాల్సింది. కన్నడలో హీరో తల్లి చనిపోవడం వల్ల అక్కడి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. మదర్ సెంటిమెంట్ విషయంలో అన్ని భాషల్లోని ప్రేక్షకులు కూడా అదే విధంగా కనెక్ట్ అవుతారు అని నేను అనుకుని సేమ్ క్లైమాక్స్ ను పెట్టేసాను.
కానీ ఇక్కడి జనాలు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే ‘యోగి’ మూవీ సూపర్ హిట్ అయ్యుండేది. ప్రభాస్ తో ఓ మూవీ చేయాలనే ఆలోచన ఉంది.. దానికి కాలం, కథ సపోర్ట్ చేయాలి.ప్రస్తుతం తను కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తవ్వాలి” అంటూ చెప్పుకొచ్చారు వినాయక్.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!