టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన గాజుల మహేష్… దాసరి కిరణ్ పై కేసు పెట్టారు. ఇతను దాసరి కిరణ్‌కు బంధువే. అయితే గాజుల మహేష్ కు ఓ ట్రావెల్ ఏజెన్సీ ఉంది. 2 ఏళ్ళ క్రితం మహేష్ దాసరి కిరణ్ కు రూ. 4.5 కోట్లు అప్పుగా ఇచ్చాడట.అప్పు చెప్పిన టైంకి తీర్చలేదు కిరణ్.
దీంతో త్వరగా అప్పు తీర్చాలని దాసరి కిరణ్ కోరడం జరిగిందట. కానీ కిరణ్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మహేష్ అలాగే అతని సతీమణి ఫ్రస్ట్రేట్ అయ్యారు. దీంతో ఆగస్టు 18న గాజుల మహేష్ అలాగే అతని భార్య కలిసి విజయవాడలో ఉన్న దాసరి కిరణ్ ఆఫీస్ కి వెళ్లి తమ డబ్బు కోసం నిలదీశారు. ఈ క్రమంలో దాసరి కిరణ్ తన అనుచరులతో దాడి చేయించినట్లు తెలుస్తోంది.
దీంతో మహేష్ దంపతులు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో దాసరి కిరణ్ పై కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు .. వెంటనే దాసరి కిరణ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాసరి కిరణ్ గతంలో రాంగోపాల్ వర్మతో పలు పొలిటికల్ మూవీస్ తీశారు. ‘వంగవీటి’ తో పాటు ‘మొగలిరేకులు’ సాగర్ తో ‘సిద్ధార్థ’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. అంతేకాదు 2024 ఎలక్షన్స్ టైంలో వచ్చిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘వ్యూహం’ కు కూడా ఈయనే నిర్మాత. మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా ఆ సినిమాని నిర్మించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ గా దాసరి నియమితులయ్యారు.