Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మూవీ సెన్సార్ రివ్యూ ఇదే.. రికార్డులు బద్దలవుతాయా?

వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ సినిమా రిలీజ్ కు సమయం ఎక్కువగానే ఉన్నా ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మెగా అభిమానులకు ఎంతగానో నచ్చేలా ఈ సినిమా ఉండనుందని సెన్సార్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది.

రీఎంట్రీలో చిరంజీవిని అభిమానులు ఏ విధంగా చూడాలని అనుకున్నారో ఈ మూవీ అదే విధంగా ఉండనుందని తెలుస్తోంది. రికార్డులు బ్రేక్ అయ్యే రేంజ్ లోనే ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, రవితేజ కాంబో సీన్లు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉండనున్నాయని బోగట్టా. సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏ మాత్రం ఢోకా లేదని తెలుస్తోంది. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉంటాయని సమాచారం.

చిరంజీవి శృతి కాంబో సన్నివేశాలు యూత్ ను సైతం తెగ ఆకట్టుకునేలా ఉండనున్నాయని తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా కోసం భారీ మొత్తం ఖర్చు చేయగా ఆ ఖర్చు తెరపై కనిపిస్తుందని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. చిరంజీవి, రవితేజ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ముఠామేస్త్రి తరహా స్టైల్ లో చిరంజీవి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుండగా రికార్డ్ స్థాయిలో అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus