‘అన్‌స్టాపబుల్‌’లో మైత్రీ వాళ్ల భారీ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా.!

ఒక సినిమా విడుదలవుతోంది అంటేనే.. ప్రమోషన్స్‌ కోసం టీమ్‌ భారీ ఏర్పాట్లు చేస్తుంది. టీవీ, యూట్యూబ్‌, సోషల్‌ మీడియా, పేపర్‌ ఇంటర్వ్యూలు ఇలా చాలానే ఉంటాయి. టాక్‌ షోలు, రియాలిటీ షోలు అంటూ చాలా రకాల వాటికి టీమ్‌ను పంపిస్తుంటారు. అలాంటిది ఒకే ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి రెండు సినిమాలు ఒకేసారి వస్తే.. ఇంకా చాలా కష్టం. అలాంటి టిపికల్‌ సిట్యువేషన్‌లో ఉంది మైత్రీ మూవీ మేకర్స్‌. దీంతో ‘అన్‌స్టాపబుల్‌’ వేదికగా భారీ ప్లాన్‌ ఒకటి వేస్తోంది. దీంతో అది వర్కవుట్‌ అయితే సినిమాలకు బంపర్‌ ప్రమోషన్‌ అంటున్నారు.

ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్‌ అనే టాక్‌ సో నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో ‘వీర సింహం’తో ‘వీరయ్య’ కలుస్తాడట. అయితే నిజంగా ఈ ఇద్దరరూ కలుస్తారా అంటే లేదని అంటున్నారు. ఆయా సినిమాల టీమ్‌లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంటే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ టీమ్లను ఒకే ఎపిసోడ్‌లో చూపించాలని అన్‌స్టాపబుల్‌ టీమ్‌ అనుకుంటోందట. మరి టీమ్స్‌లో ఎవరెవరు వస్తారు అనేది చూడాలి. రెండింటికీ నిర్మాతలు, హీరోయిన్‌, కొరియోగ్రాఫర్‌ మాత్రమే కామన్‌.

ఇక సినిమాల ఇండివిడ్యువల్‌ ప్రచాం సంగతి చూస్తే.. ఇప్పటికే సింగిల్స్‌ రిలీజ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఐదో పాట త్వరలో విడుదల కాబోతోంది. ఆ వెంటనే ప్రి రిలీజ్‌ ఈవెంట్ పెట్టబోతున్నారు. దీని కోసం ‘వీరయ్య’ వాల్తేరు వెళ్లబోతున్నాడు. నాలుగో తేదీ ఈ ఈవెంట్‌ ఉంటుంది అన్నారు కానీ.. ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఆ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తారని టాక్. మరోవైపు బాలయ్య ఈ సినిమా ఈవెంట్‌ను ఒంగోలులో చేయాలని అనుకుంటున్నారట.

ఈ నెల 6న ఆ ఈవెంట్‌ నిర్వహిస్తారని సమాచారం. వీటితోపాటు హైదరాబాద్‌లో కూడా రెండు పెద్ద ఈవెంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. వాటి కోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. అయితే అవేంటి అనేది తెలియాల్సి ఉంది. ‘వీర సింహం’ జనవరి 12న, ‘వీరయ్య’ 13న థియేటర్లలోకి వస్తారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus