ఈ ముగ్గురిలో సంక్రాంతి విన్నర్ ఎవరో!

మన స్టార్ హీరోలు నటించిన సినిమాలు నెలకి ఒకటి విడుదలవ్వడమే గగనమైపోతున్న తరుణంలో ఒకే నెలలో అది కూడా వారం గ్యాప్ కూడా లేకుండా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతుండడం ప్రతి ఒక్క సినిమా అభిమానికి పట్టరాని ఆనందాన్ని అందించే విషయం. మన నందమూరి బాలకృష్ణ “జై సింహా”గా జనవరి 12న వస్తుండగా.. సరిగ్గా రెండ్రోజుల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ణాతవాసి”గా జనవరి 10న ప్రేక్షకులను పలకరించనున్నారు. వీరిద్దరితోపాటు బరిలోకి రవితేజ కూడా “టచ్ చేసి చూడు” అంటూ దూసుకొస్తున్నాడు. అలాగే రాజ్ తరుణ్ కూడా “రాజుగాడు”గా వస్తున్నాడనుకోండి. ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాల నడుమ మనోడిది ఆటలో అరటిపండు లాంటి సినిమా అనుకోండి.

అయితే.. ప్రతి సంక్రాంతికి ఇలాంటి పోటీ ఉన్నప్పటికీ ముగ్గురు డిఫరెంట్ జోనర్ హీరోలు డిఫరెంట్ సినిమాలతో వస్తుండడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. రవితేజ నటిస్తున్న “టచ్ చేసి చూడు” క్లాసీ యాక్షన్ ఎంటర్ టైనర్ కాగా, బాలయ్య నటిస్తున్న “జై సింహా” ఉరమాస్ మసాలా చిత్రం, ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న “అజ్ణాతవాసి” మాస్ అండ్ క్లాస్ కాంబో పవర్ ప్యాక్డ్ సినిమా. ముగ్గురి సినిమాలూ హిట్ అయినా ఎవరో ఒకరు మాత్రమే సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారు. మరి ఆ విన్నర్ ఎవరు అనేది 2018 సంక్రాంతికి ఆసక్తికరమైన విషయంగా మారనుంది. అలాగే మెగా అండ్ నందమూరి ఫ్యామిలీ అభిమానులకు కూడా ఈ సంక్రాంతి కీలకం. మరి ఎవరు విన్నర్, ఎవరు లూజర్ అనేది తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus