Bollywood: నిజ జీవిత హీరోలను చూపించబోయేది వీరే!

  • October 25, 2021 / 04:58 PM IST

దేశభక్తి సినిమాలు అన్ని ఇండస్ట్రీల్లో వస్తుంటాయి కానీ… బాలీవుడ్‌లో కొంచెం ఎక్కువ వస్తుంటాయి. స్పాన్‌ ఎక్కువగా ఉండటం, అక్కడ ఇలాంటి కథలకు ఎక్కువగా ఆదరణ ఎక్కువగా ఉండటం లాంటి కారణాలతో హిందీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఐదారు సినిమాలు ఇలాంటివి సిద్ధమవుతున్నాయి. ఏంటా సినిమాలు, ఎవరు నటిస్తున్నారు, ఎవరి జీవితం తదితర విషయాలు మీ కోసం…

* బాలీవుడ్‌లో జీవిత కథలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా కంగనా రనౌత్‌. తాజాగా ఆమె ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా ఓ సినిమా చేస్తోంది. సర్వేష్‌ మేవ్రా రూపొందిస్తున్నారు. అయితే ఇది జీవిత కథ కాదు. ప్రస్తుత దేశ పరిస్థితులను ఇందులో చూపించబోతున్నారు.

* విక్కీ కౌశల్‌ నటిస్తున్న మరో జీవిత కథ ‘సామ్‌ మానెక్‌షా’. భారతీయ తొలి ఫీల్డ్‌ మార్షల్‌ అయిన సామ్‌ మానెక్షా 1971 భారత్‌ పాక్‌ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌ గా పనిచేశారు. మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

* కార్తీక్‌ ఆర్యన్‌ నుండి రానున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘కెప్టెన్‌ ఇండియా’. హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కార్తీక్‌ పైలెట్‌గా నటిస్తున్నాడు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ అపరేషన్‌ను ఈ సినిమాలో చూపిస్తున్నారట.

* బ్రిగేడియర్‌ బల్‌రామ్‌సింగ్‌ మెహతా జీవిత కథతో వస్తున్న సినిమా ‘పిప్పా’. 1971 భారత్‌ – పాక్‌ యుద్ధంలో పోరాడిన వీర జవాను కథ ఇది. ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ యుద్ధంలో పిప్పా అనే యుద్ధ ట్యాంక్‌ కీలకంగా నిలిచింది. అందుకే ఆ పేరే ఈ సినిమాకు పెట్టారు. రాజా మీనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

* పరమ వీరచక్ర గ్రహీత అర్జున్‌ ఖెటార్‌పాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్‌’. వరుణ్‌ధావన్‌ ప్రధాన పాత్రధారి. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు. ఈ సినిమా కూడా 1971 భారత్‌, పాక్‌ యుద్ధం నేపథ్యంలోనే సాగుతుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus