ఆది సాయి కుమార్ కొత్త సినిమా టైటిల్ వివాదం..క్లారిటీ ఇచ్చిన నిర్మాత

సినిమా టైటిల్స్ క్లాష్ కావడమనేది చాలా అరుదు. ఒకే పేరుతో రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తున్నాయంటే జనం కన్ఫ్యూజ్ అవుతారు. తాజాగా టాప్ గేర్ సినిమా విషయంలో అదే సీన్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఆది సాయి కుమార్ హీరోగా టాప్ గేర్ అనే టైటిల్ తో ఓ సినిమాను అనౌన్స్ చేసి టైటిల్ లోగో కూడా రివీల్ చేశారు నిర్మాత K. V. శ్రీధర్ రెడ్డి. ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇదే టాప్ గేర్ టైటిల్ పెట్టి మలయాళ హీరోతో మరో సినిమా రానుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మలయాళ సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఇది తమ సినిమా టైటిల్‌ అని, ఈ టాప్ గేర్ టైటిల్ హక్కులన్నీ తమ వద్ద ఉన్నాయని చెప్పారు నిర్మాత K. V. శ్రీధర్ రెడ్డి. తమ సినిమా షూటింగ్ చేస్తున్న ఈ సమయంలో ఓ మలయాళం సినిమాను అదే పేరుతో రూపొందిస్తూ ఇక్కడ ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు K. V. శ్రీధర్ రెడ్డి.

సదరు నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న టాప్ గేర్ సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని, టాప్ గేర్ పేరుతో తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తమ సినిమాను చకచకా కంప్లీట్ చేస్తున్నామని చెప్పారు K. V. శ్రీధర్ రెడ్డి. తమ టాప్ గేర్ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని సెప్టెంబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు.

రీసెంట్ గానే ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో వేలాది మంది స్టూడెంట్స్ నడుమ ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని K. V. శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus