మనిషి పోయేటప్పుడు ఏం తీసుకెళ్లరు అని మనవాళ్లు వేదాంతం చెబుతుంటారు. అయితే అలా అందరినీ విడిచి వెళ్తూ తీసుకెళ్లేవి చాలా ఉంటాయి. జ్ఞానం, మెమొరీస్, టాలెంట్, అభిమానం వాటిలో కొన్ని. తమకు మాత్రమే తెలిసిన ఈ మూడు ఆ మనిషితో పాటు భూమిని విడిచివెళ్లిపోతాయి. వాటిని తిరిగి వేరే ఎవరి దగ్గర నుండీ పొందలేం. ఇదంతా ఎవరి కోసం అంటే టాలీవుడ్ మీడియాకు పెద్ద దిక్కు, ప్రముఖ పీఆర్వో బీఏ రాజు. అనారోగ్య కారణాలతో ఆయన శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఒకటి, రెండు ఆసక్తికర అంశాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది.
బీఏ రాజు మృధుస్వభావి, 1500 సినిమాలకుపైగా పీఆర్వోగా చేశారు, కొన్ని సినిమాలు నిర్మాతగానూ చేశారు.. ఇవన్నీ అందరికీ తెలుసు. ఇవి కాకుండా ఆయనను దగ్గర నుండి చూసినవారికి ఇంకొన్ని తెలుస్తాయి. అందులో ఒకటి ఆయన జ్ఞానం. టాలీవుడ్‌లో కొన్ని సినిమాల గురించి, అందులోనూ పాత సినిమాల గురించి ఆయన దగ్గరున్న జ్ఞానం ఇంకే పీఆర్వో దగ్గర ఉండదు. ఆయన ట్వీట్లు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ఎప్పటిదో సినిమా యానివర్శిరీలను గుర్తు చేస్తూ ఆయన రోజూ ట్వీట్లు చేస్తుంటారు. నాటి ఫొటోలను పంచుకుంటుంటారు కూడా. వాటిని అభిమానులు, ఆయన ఫాలోవర్లు మిస్ అవుతారు.
బీఏరాజుకు సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలామందికి తెలుసు. ఎంతగా అంటే కృష్ణకు నేనే పీఆర్వో, మహేష్‌బాబుకు పీఆర్వో, రేపు గౌతమ్ కృష్ణ సినిమా చేసినా నేనే పీఆర్వో అనేవారాయన. అంతగా కృష్ణ కుటుంబానికి ఆయన ప్రీతిపాత్రుడు. అంతేకాదు కృష్ణ నటించిన 300కుపైగా సినిమాల జాబితా ఆయన తెలుసు. అది కూడా ఎలా అంటే.. ఆయనకు కాస్త సమయం దొరికినా… కృష్ణ మొదటి సినిమా నుండి ఇటీవల నటించిన ‘శ్రీశ్రీ’ వరకు లిస్ట్ రాస్తుంటారు. అది ఆయన వ్యాపకం. సినిమా నెంబరు, పేరు, దర్శకుడి పేరు రాసుకుంటూ ఉంటారాయన. అయనకు అదో సరదా.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!