2018లో వచ్చిన “జీరో” తర్వాత నాలుగేళ్ల విరామం అనంతరం షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “పఠాన్”.
“వార్” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & పాటలు భారీ అంచనాలను నెలకొల్పాయి.
మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? 2013 నుంచి సరైన హిట్ లేక ఢీలాపడిన షారుక్ ఖాన్ కు ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ హిట్ దొరికిందా లేదా? అనేది చూద్దాం..!!
కథ: భారతదేశంపై భారీ దాడి ప్లాన్ చేసిన ఔట్ ఫిట్ ఎక్స్ అనే గ్యాంగ్ కి లీడర్ జిమ్ (జాన్ అబ్రహాం). డైరెక్ట్ ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ “రా”ను బెదిరిస్తాడు. దాంతో..
కొంతకాలంగా అజ్ణాతంలో ఉన్న పఠాన్ (షారుక్ ఖాన్)కు కబురు పెడుతుంది రా. జిమ్ & గ్యాంగ్ ను ఎదుర్కోవడానికి పఠాన్ ఎలాంటి రిస్క్ చేశాడు? దాడిని తప్పించడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పఠాన్” చిత్రం.
నటీనటుల పనితీరు: షారుక్ ఖాన్ దాదాపు 10 ఏళ్ళ తర్వాత తన బెస్ట్ లుక్ లో కనిపించారు. నటుడిగా ఆయన ఏస్థాయిలో ఆకట్టుకుంటారు అనే విషయాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేయనక్కర్లేదు.
ఆయన స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీ టైమింగ్ ను ఆడియన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే.. యాక్షన్ సీన్స్ లో షారుక్ ప్రెజన్స్ ఫ్యాన్స్ కి పండగే.
దీపిక పడుకొనే లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఆమె సెక్స్ అప్పీల్ & సాంగ్స్ లో డ్యాన్సులు మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ లాంటివి.
నెగిటివ్ రోల్లో జాన్ అబ్రహాం అదరగొట్టాడు. అశుతోష్ రాణా, డింపుల్ కపాడియాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతికవర్గం పనితీరు: చిత్రబృందంలో అత్యధిక స్కోర్ సాధించిన టెక్నీషియన్ కెమెరామెన్ సత్చిత్ పౌలోస్.
సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం పలు హాలీవుడ్ చిత్రాలను గుర్తుకు తెచ్చినప్పటికీ.. సదరు సన్నివేశాలను, యాక్షన్ బ్లాక్స్ ను ఇండియనైజ్ చేసిన విధానం బాగుంది.
సంచిత్ – అంకిత్ ద్వయం సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. అదే రీతిలో నేపధ్య సంగీతం కూడా అదిరింది.
హీరోయిజాన్ని, యాక్షన్ బ్లాక్స్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసిన తీరు విశేషంగా మెప్పిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ టాప్ క్లాస్ గా ఉన్నాయి.
దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నుంచి సగటు ప్రేక్షకులెవరూ అద్భుతమైన కథ ఆశించరు. ఆ విషయం అతడికి కూడా తెలుసు.. అందుకే కథను గాలికొదిలేసి, యాక్షన్ బ్లాక్స్ & ఎలివేషన్ సీన్స్ తో నెట్టుకొచ్చేస్తుంటాడు.
“పఠాన్” విషయంలోనూ అదే చేశాడు. యాక్షన్ సీన్స్ అన్నీ జేమ్స్ బాండ్ & ఫాస్ట్ సిరీస్ సినిమాల నుంచి లేపేసిన సిద్ధార్థ్, కనీసం సదరు సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం మార్చినా బాగుండేది.
ఇంతటి భారీ స్టార్ క్యాస్టింగ్, బడ్జెట్, వి.ఎఫ్.ఎక్స్, యాక్షన్ బ్లాక్స్ & సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ ఉన్నందుకు..
కనీస స్థాయి ఎమోషన్ ఉండి ఉంటే బాలీవుడ్ రికార్డ్స్ అన్నీ తారుమారయ్యేవి. సో, దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టినా, కథకుడిగా విఫలమయ్యాడు సిద్ధార్థ్.
విశ్లేషణ: కథను పట్టించుకోకుండా, షారుక్ స్క్రీన్ ప్రెజన్స్ & యాక్షన్ బ్లాక్స్ ను ఎంజాయ్ చేస్తూ..
చివర్లో వచ్చే సల్మాన్ ఎంట్రీని ఆస్వాదించగలిగితే.. “పఠాన్”ను బాగా ఎంజాయ్ చేస్తారు. హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తూ, కథకు ప్రాధాన్యత ఇచ్చే జనాలకు మాత్రం ఎబౌ యావరేజ్ సినిమా అనిపిస్తుంది.
రేటింగ్: 3/5