Pooja Hegde: చెర్రీ తోటలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన బుట్ట బొమ్మ.. ఫోటోలు వైరల్!

పూజా హెగ్డే ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పూజ హెగ్డే నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వీటి ప్రభావం తన కెరియర్ పై ఏమాత్రం చూపించలేదని చెప్పాలి.ఇలా వరుస సినిమాలో ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

ఇలా వరుస సినిమాలతో నిత్యం ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే వీకెండ్ మాత్రం అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుంది. ఇలా వీకెండ్ సమయంలో ఈమె తన ఆర్గానిక్ ఫామ్ లో పెంచుతున్నటువంటి పండ్ల తోటలో విహరిస్తూ పెద్ద ఎత్తున సందడి చేసింది. పొట్టి డ్రస్సు ధరించి చెర్రీ తోటలో పండ్లను తెంపుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.ఈ క్రమంలోనే ఎంతో స్టైలిష్ లుక్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉన్నటువంటి ఈ ఫోటోలను పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పూజా హెగ్డే పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టపడటంతో తానే స్వయంగా ఆర్గానిక్ ఫార్మ్ ద్వారా ఎన్నో రకాల పండ్లను పండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె వీకెండ్ సందర్భంగా చెర్రీ తోటలో సందడి చేశారు. చెట్ల నుంచి చెర్రీలను తెంపుతూ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఈ పండ్లు మీకోసమే అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలను మరో నటి అనుపమ పరమేశ్వరన్ లైక్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక పూజ హెగ్డే సినిమాల విషయానికొస్తే ఈమె నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో జనగణమన,మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోని నటిస్తున్నారు అదేవిధంగా మరో బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ వరుస సినిమాలతో, వరస షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus