Salaar 2: ‘సలార్‌ 2’ను కాదని.. తారక్‌ సినిమా స్టార్ట్‌ చేస్తారా? క్లారిటీ ఇస్తారా?

  • May 22, 2024 / 06:01 PM IST

నెల క్రితం వరకు కన్నడ – తెలుగు సినిమా మీడియాలో ‘సలార్‌ 2’ గురించే మాట్లాడారు. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం కోసం ఏర్పాట్లు చేస్తున్నారని, ఎప్పటిలాగే సెట్స్‌ రెడీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు సినిమాలు జనాలు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ సినిమా గురించి వార్తలు నెమ్మదిగా ఆగుతున్నాయి. కారణం ప్రశాంత్‌ నీల్‌ మరో సినిమా షూటింగ్‌ వివరాలు బయటకు రావడమే. తారక్‌ (Jr NTR) జన్మదినం సందర్భంగా #NTRNeel అంటూ ఓ హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టి ఇంతకుముందు చెప్పిన సినిమాకు సంబంధించిన అప్‌డేటే చెప్పారు.

దాని ప్రకారం చూస్తే ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టు నుండి ప్రారంభం అవుతుంది. ఈ ప్రకటన రావడం ఆలస్యం తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లోకి వెళ్లగా.. ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్‌ ఢీలా పడిపోయారు. ఎందుకంటే త్వరలో ‘సలార్‌ 2’ షూటింగ్ అని ఈ మధ్య వరకు వార్తలొచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘సలార్ : సీజ్ ఫైర్’ (Salaar) రిలీజ్‌ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇటీవల అంటే నెల క్రితం ‘సలార్‌ 2’ పనులు మొదలు అన్నారు.

కానీ ఇప్పుడేమో తారక్‌ సినిమా అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’ ఎప్పుడు అనే చర్చ మొదలైంది. దాంతోపాటు ప్రభాస్‌ సినిమాల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. ‘సలార్‌ 2’ అయిపోతే మిగిలిన సినిమా చేసుకోవచ్చు అనేది అభిమానుల మాట. దీంతో నిజంగానే తారక్‌ – ప్రశాంత్‌ సినిమా మొదలవుతుందా? అనే డౌట్‌ కూడా వస్తోంది.

ఇక్కడ మరో కారణం ఏంటంటే ఆ సినిమా లుక్‌.. తారక్‌ ఇతర సినిమాల లుక్‌లు ఒకలా ఉండవు. కాబట్టి పారలల్‌ షూటింగ్‌ కష్టం. ‘దేవర 1’ (Devara) ఇంకా అవ్వలేదు. ‘దేవర 2’ కూడా ఉంది. ‘వార్ 2’ ఉంది. దీంతో అసలు తారక్‌ – నీల్‌ సినిమా నిజంగానే ఆగస్టులో స్టార్ట్‌ అవుతుందా అనేది అర్థం కావడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus