Bigg Boss: 8వ వారం నామినేషన్స్ లో వీళ్లే..! బాబాభాస్కర్ స్పెషల్ పవర్ ఏంటో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. ఒకరినికొకరు నిందించుకుంటూ ముఖంపై ఫోమ్ రాసుకుంటూ మరీ నామినేషన్స్ చేస్కున్నారు. ముఖ్యంగా మంచి మిత్రులు అనుకున్నవాళ్లు బద్ద శత్రువులుగా మారిపోయారు. ముఖ్యంగా అరియానా అషూరెడ్డి ఇద్దరూ ఒకరినొకరు బాగా అరుచుకున్నారు. టీజ్ చేసుకున్నారు. అరియానా సంచాలక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు తను కెప్టెన్సీలో జరిగిన తప్పులని ఎత్తి చూపే ప్రయత్నం చేసింది.

Click Here To Watch NOW

అంతేకాదు, చాలా లాజికల్ గా పాయింట్స్ ని మాట్లాడుతూ వెటకారంగా సమాధానం చెప్పింది. నీకు ఏ విషయంలో కాలిందో నాకు తెలీదు కదా అని అషూరెడ్డి చెప్తున్నా కూడా అసలు పాయింట్ చెప్పకుండా వేరే పాయింట్స్ ని మాట్లాడింది. ఇక్కడే ఫుడ్ గురించి , యాక్సెస్ కార్డ్ గురించి పాయింట్స్ చెప్పింది. అలాగే, తను కెప్టెన్సీ కి సపోర్ట్ చేసినపుడు జ్యూస్ ఇస్తానని డీల్ కూడా ఉంది అని అది కూడా నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పింది అరియానా.

అలాగే, శివ నోట్లోనుంచీ ఫుడ్ లాగడం కరెక్టేనా అంటూ మాట్లాడింది. ఇలా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసింది అరియానా. చాలాసేపు ఇద్దరి మద్యలో వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత అఖిల్ బిందు ఇద్దరూ ఎప్పటిలాగానే ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అనిల్, నటరాజ్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ హమీదా ఇలా నామినేషన్స్ లో పాయింట్స్ మాట్లాడుతూ హౌస్ నీ హీటెక్కించారు. ఇక ఎప్పటిలాగానే మిత్రాశర్మా బిందుని నామినేట్ చేస్తూ తనదైన స్టైల్లో పాయింట్ ని లేపింది.

ఈసారి నామినేషన్స్ లో స్రవంతి టాపిక్ తీసుకుని వచ్చి దాన్ని హైలెట్ చేయడం అనేది విశేషం. అఖిల్ , బిందు, మిత్రా ఇలా ముగ్గురూ కూడా స్రవంతి టాపిక్ తీస్కుని వచ్చి ఎమోషనల్ టచ్ ఇచ్చేందుకు ట్రై చేశారు. ఈ నామినేషన్స్ తతంగం అంతా సీక్రెట్ రూమ్ లో ఉన్న బాబాభాస్కర్ చూస్తునే ఉన్నారు. ఇక్కడే హమీదా ఆర్గ్యూమెంట్ చేస్తున్నప్పుడు అంతసేపు బాబాభాస్కర్ ఓపిగ్గా ఉండలేకపోయాడు. తనదైన స్టైల్లో కామెంట్స్ విసురుతూనే ఉన్నాడు.

ఇక హమీదా ఇంకా నటరాజ్ మాస్టర్ , హమీదా అజయ్ మద్యలో భీబత్సమైన వాగ్వివాదం జరిగింది. ఇక్కడే అజయ్ నువ్వు ఇంట్లోనుంచీ వెళ్లేవరకూ నిన్ను నామినేట్ చేస్తా, నువ్వు కూడా అలాగే చేయి అంటూ హమీదాపై రెచ్చిపోయాడు. అలాగే, హమీదా కూడా అజయ్ ని నామినేట్ చేస్తూ ఎక్కడా తగ్గలేదు. ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లాయి. ఫైనల్ గా సీక్రెట్ రూమ్ లో బాబాభాస్కర్ కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు.

నామినేట్ అయినవాళ్లలో నుంచీ ఒకర్ని సేవ్ చేయమని చెప్పాడు. దీంతో బాబాభాస్కర్ బిందుమాధవి పాయింట్ లో అర్ధముందని సేవ్ చేశాడు. దీంతో ఈవారం బిందుమాధవి నామినేషన్స్ నుంచీ సేఫ్ అయ్యింది. ఈవారం మొత్తం ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అఖిల్, అనిల్, హమీదా, అషూరెడ్డి, ఇంకా అజయ్. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus