‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యింది. 5 సీజన్ల వరకు సక్సెస్ ఫుల్ గా సాగింది. కానీ ఎప్పుడైతే ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ మొదలుపెట్టారో అక్కడి నుండి పడిపోయింది అని చెప్పాలి. ‘బిగ్ బాస్’ కి క్రేజ్ బాగా తగ్గిపోయింది. అందుకు కారణం కంటెస్టెంట్ ల ఎంపిక అస్సలు బాగోవడం లేదు అనేది ఎక్కువగా వినిపిస్తున్న ఆన్సర్. ‘బిగ్ బాస్ 6 ‘ కి సంబంధించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చలు జరిగిన సందర్భాలు లేవు.
దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ‘బిగ్ బాస్’ కి కాస్త పేరున్న సెలబ్రిటీలు ఎవ్వరూ రావడం లేదు అని..! అయితే బిగ్ బాస్ హౌస్ కి ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉండేది. అదే ‘బిగ్ బాస్’ వాయిస్. కేవలం దాని కోసమే బిగ్ బాస్ చూసేవారు ఉన్నారు అని చెప్పినా అతిశయోక్తి అనిపించుకోదు. బిగ్ బాస్ గా హౌస్ లో 6 సీజన్లుగా వినిపిస్తున్న గొంతు ఆర్టిస్ట్ రాధాకృష్ణది. ఈయన ఎన్నో సినిమాలకు పనిచేసిన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్.
బిగ్ బాస్ కోసం వంద గొంతులు పైగా పరిశీలించి ఇతన్ని ఫైనల్ చేశారు. ఆయన వాయిస్ ఎంతో గంభీరంగా ఉండేది. కానీ సీజన్ 7 కి మాత్రం అతన్ని మార్చేసినట్టున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లు కనుక గమనిస్తే ఇది ఇట్టే అర్థమవుతుంది. ఈ సీజన్ కి బిగ్ బాస్ (Bigg Boss) వాయిస్ చాలా కామెడీ గా ఉంటుంది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.