టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే అందరూ దిల్ రాజు పేరే చెప్తారు అనడంలో సందేహం లేదు. ఆయన నిర్మించే సినిమాలు మాత్రమే కాదు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలు సంచలన విజయాలు నమోదు చేసేవి. అయితే ఇప్పుడు ఆయన హవా కాస్త తగ్గిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో పెద్ద సినిమాలకి ధీటుగా దిల్ రాజు నిర్మించే చిన్న సినిమాలు భారీ ఎత్తున విడుదలయ్యేవి. ప్రచారం కూడా ఆయన అదే రేంజ్లో చేసేవాడు. అయితే ఇప్పుడు దిల్ రాజులో కానీ ఆయన నిర్మించే లేదా డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల్లో కానీ అంతటి జోష్ కనిపించడంలేదు.
‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమా పర్వాలేదనిపించినా.. దిల్ రాజు రిలీజ్ చేసిన ‘ఆవిరి’ ‘తుపాకీ రాముడు’ సినిమాలు విడుదలైనట్టు కూడా చాలా మందికి తెలీదు. ఇక ’96’ రీమేక్ అలాగే ‘ఇద్దరి లోకం ఒకటే’ వంటి సినిమాలకు సంబంధించి అప్డేట్స్ లేకపోగా ఆ సినిమాల పై కనీసం బజ్ కూడా ఏర్పడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి పెద్ద హీరో చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన డిస్ట్రిబ్యూషన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడని.. ప్రమోషన్స్ ను విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. అసలు ఎందుకు ‘దిల్ రాజు’ డల్ అయ్యారా? అనే డిస్కషన్లు ఫిలింనగర్లో ఎక్కువ జరుగుతున్నాయి.