కరోనా సెకండ్ వేవ్ తగ్గినా… టాలీవుడ్‌లో సరైన సినిమాలు ఇంకా రావడం లేదనే చెప్పాలి. జనాలు థియేటర్లకు రారనే ఆలోచనో, ఇంకేదో కానీ మన నిర్మాతలు కొందరు ఓటీటీల వైపు తమ సినిమాల్ని తీసుకెళ్లిపోయారు. అలా వెళ్లిపోయారు అని వార్తలొస్తున్న సినిమాల్లో ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’, ‘దృశ్యం 2’, ‘మ్యాస్ట్రో’ ఉన్నాయని టాక్. అయితే ఈ సినిమాల ప్రచారం ఇంకా ఎందుకు షురూ చేయలేదు. అదీ ప్రశ్న. థియేటర్లలో సినిమా విడుదల అంటే కనీసం నెల రోజుల నుండి ముందు నుండైనా ప్రచారం షురూ చేస్తారు.
గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సింగిల్… అంటూ ఏదో పేరు పెట్టి ప్రచారం చేస్తుంటారు. కానీ ఓటీటీలకు వెళ్లాయి అని చెబుతున్న ఈ సినిమాల గురించి ఎలాంటి ప్రచారం మొదలవ్వలేదు. దీంతో అసలు ఆ సినిమాలు ఓటీటీకి వెళ్లాయా? లేక ఓటీటీకి ఇచ్చేశాం కదా అని నిర్మాతలు చేతులు దులుపుకున్నారా అనేది అర్థం కావడం లేదు. బాలీవుడ్‌లో చూస్తే… ఓటీటీలకు వెళ్లిన సినిమాలకు కూడా థియేటర్ల స్థాయి ప్రచారం చేస్తున్నారు.
మన దగ్గరకు వచ్చేసరికి విడుదలకు దగ్గర్లో ఏదో మొక్కుబడి ఇంటర్వ్యూలు ఇచ్చి వదిలేస్తున్నారు. అయితే తెలుగు ఓటీటీ ‘ఆహా’ మాత్రం ఇందుకు విరుద్ధం. ఎప్పుడో ఏళ్ల క్రిందట విడుదలైన సినిమాల్ని డబ్బింగ్ చేసి… తెలుగులోకి తెచ్చి భారీ ప్రచారం చేసి మరీ విడుదల చేస్తోంది. మరి స్ట్రెయిట్ సినిమాలకు ఇంకెంత ఉండాలి. ఒకవేళ మన దర్శకనిర్మాతలు ఇలానే ఉంటే… రాబోయే రోజుల్లో కష్టమే అంటున్నారు నిపుణులు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!