Prabhas: ప్రభాస్‌ న్యూ లుక్‌లో ఈ పాగా లెక్కేంటో?

తొలి సినిమా చేసినప్పుడు ఉన్న ఛరిష్మా ఓ 20 సినిమాల తర్వాత కూడా ఉండాలి అని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అయితే మన హీరోల విషయంలో ఇలాంటి అత్యాశలు చాలానే ఉంటాయి అభిమానులకు. అందుకు తగ్గట్టే మన హీరోలు కూడా కష్టపడి వర్కవుట్లు చేసి, బాడీని ఫిట్‌గా ఉంచుకుంటారు. ఏమాత్రం లుక్‌లో తేడా వచ్చిన ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారు. ట్రోలర్స్‌ రెడీ అవుతారు. దీంతో లుక్‌ విషయంలో హీరోలు జాగ్రత్త పడుతున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం ఈ విషయాన్ని లైట్‌ తీసుకుంటున్నారా? అవుననే అనిపిస్తోంది ఆయన రీసెంట్‌గా చేస్తున్న పనులు చూస్తే.

మొన్నీ మధ్య ‘ఆదిపురుష్‌’ టీమ్‌ను ముంబయిలో ప్రభాస్‌ కలిశాడు. అక్కడ ప్రభాస్‌ లుక్‌ను చూసి ఫ్యాన్స్‌, నెటిజన్లు చాలా ఖుష్‌ అయిపోయారు. లావు తగ్గి ప్రభాస్‌ పాత లుక్‌లోకి వెళ్తున్నట్లు ఆ వీడియోలు, ఫొటోల్లో కనిపించింది. దీంతో హమ్మయ్య డార్లింగ్‌ మళ్లీ హ్యాండ్సమ్‌ లుక్‌లోకి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. అయితే ఆ ఆనందాన్ని ఎక్కువ రోజులు నిలపలేదు ప్రభాస్‌. వైజయంతి మూవీస్‌ కొత్త ఆఫీసు ఓపెనింగ్‌ సందర్భంగా ప్రభాస్‌ మళ్లీ కనిపించాడు. దీంతో మళ్లీ ఫ్యాన్స్‌కి కోపమొచ్చేసింది. ట్రోలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వైజయంతి ఆఫీసు ఓపెనింగ్‌ వీడియలో చూస్తే ప్రభాస్‌ తలకు ఓ పాగా లాంటిది కట్టుకుని వచ్చాడు. ఆ పాగా లాంటి బాండ్‌ చూడటానికి ట్రెండీగా ఉన్నా.. ఆ లుక్‌లో ప్రభాస్‌ ముసలోడిలా ఉన్నాడని ట్రోలర్స్‌ అంటుంటే.. ఫ్యాన్స్‌ మాత్రం డార్లింగ్‌కి ఈ లుక్‌ బాగాలేదు అని అంటున్నారు. ఒత్తైన జుట్టుతో ప్రభాస్‌ అంతెత్తు కటౌట్‌తో నడిచొస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు అని అంటున్నారు ఫ్యాన్స్‌. ఈ విషయం సగటు ప్రేక్షకుడికీ తెలుసు. గతంలో కొన్ని సందర్భాల్లో అలాంటి లుక్‌లో ప్రభాస్‌ను చూసి మురిసిపోయాం కూడా.

ఈ విషయాలన్నీ ప్రభాస్‌కి కూడా. అయినప్పటికీ ఎందుకు అలా పాగా లుక్‌లో బయటకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. కొందరు లుక్‌ బాగాలేదు అని వదిలేస్తుంటే, మరికొందరమో ప్రభాస్‌ జుట్టుకు ఏమైంది అలా పాగా పెట్టుకు వచ్చాడు అని అడుగుతున్నారు. ఈ కామెంట్లు ఆగాలంటే మరోసారి ప్రభాస్‌ ఫుల్‌ కటౌట్‌ లుక్‌ బయటకు రావాల్సిందే. ట్రోలర్ల నోళ్లు మూతపడాల్సిందే. డార్లింగ్‌ వింటున్నావా? కనీసం ఆయన టీమ్‌ అయినా?

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus