Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

ఎన్టీఆర్‌ అభిమానులను గత కొన్ని నెలలుగా వేధిస్తున్న రెండు ప్రశ్నల్లో ఒకదానికి ఆన్సర్‌ వచ్చేసింది. ఇంకో ప్రశ్నకు ఆన్సర్‌ రాకపోగా ఇంకాస్త కన్‌ఫ్యూజ్‌ని తీసుకొచ్చింది. దీనంతటి కారణం ‘దేవర 2’ సినిమాల్లో ఒకరైన సుధాకర్‌ మిక్కిలినేని చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఆ సినిమా షూటింగ్‌ను మే నెల నుండి స్టార్ట్‌ చేస్తాం అని అనౌన్స్‌ చేసేశారు. అసలు ఈ సినిమా ఉంటుందా, ఉండదా అనేది తేలక గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుకున్న ఫ్యాన్స్‌కి ఇది ఊరటనిచ్చే అంశమే.

Dragon

‘దేవర’ సినిమా వసూళ్ల విషయంలో ఎన్ని విమర్శలు ఉన్నా, రిలీజ్‌ నిర్మాత నాగవంశీ వసూళ్ల పోస్టర్లపై చేసిన కామెంట్లు పదే పదే వైరల్‌ అవుతున్నా.. సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌, నటన, వైబ్‌ నచ్చిన కథ కావడంతో ‘దేవర 2’ సినిమా గురించి ఫ్యాన్స్‌ ఎదురుచూస్తూనే ఉన్నారు. అందుకే ఫ్యాన్స్‌లో ఆ ఆనందం. కానీ ఇప్పుడు మే నాటికి ఈ సినిమా మొదలుపెట్టాలి అంటే ప్రశాంత్‌ నీల్‌ సినిమా ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) పరిస్థితి ఏంటి అనేదే ప్రశ్న. అదేముంది సినిమా షూటింగ్‌ ఆ టైమ్‌కి అయిపోతుంది కదా అంటారా. అక్కడే ఉంది మెలిక.

ఏంటంటే.. ‘డ్రాగన్‌’ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇదిగో షూటింగ్‌, అదిగో షూటింగ్‌ అని టీమ్‌ చెబుతూనే వచ్చింది కానీ షూటింగ్‌ మొదలవ్వలేదు. మొన్నీమధ్య ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ అయింది అని చెప్పారు. వెంటనే తారక్‌కి స్వల్ప అనారోగ్యం అంటూ షూటింగ్‌ ఆపేశారు. మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పలేదు. మొదలైనట్లు కూడా చెప్పలేదు. దీంతో అసలు ఈ సినిమా ముందుకెళ్తుందా? సక్రమంగా పూర్తయి వస్తుందా అనే డౌట్స్‌ ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్‌ సినిమా గురించి చర్చ వచ్చేసరికి ఆ సినిమా సంగతేంటి అనే ప్రశ్న మొదలైంది.

చూద్దాం తన తీరుకు విరుద్ధంగా ప్రశాంత్‌ నీల్‌ ఏమన్నా ఈ సినిమాను త్వరగా ముగిస్తారా? లేక ఎన్టీఆర్‌ రెండు సినిమాలకు డేట్స్‌ ఇస్తూ, లుక్‌ను అడ్జెస్ట్‌ చేస్తూ సినిమా చేస్తారా అని. రెండూ కష్టమే. కాబట్టి మూడో ఆప్షన్‌ ఏమన్నా చూస్తారేమో.

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus