రతిక వెళ్లిపోతూ హౌస్ మేట్స్ కి మంచి చేసిందా ? బ్రేక్ టైమ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ అంటే ఒకప్పుడు బంధాలు, అనుబంధాలతో కలకలలాడేది. ఆ తర్వాత నేను బాండింగ్ కోసం రాలేదు.., విన్నింగ్ కోసం వచ్చానని ప్రగల్భాలు పలకడం ఎక్కువైపోయాయి. ఇప్పుడైతే ఏకంగా స్వార్ధపూరితమైన గేమింగ్ ని చూస్తున్నారు ప్రేక్షకులు. ఒకరి క్రేజ్ ని వాడుకుని పైకి రావడం, లేదా ఒకరిపై నిందలు వేసి వారిని కిందకి లాగి పైకి ఎదగాలి అనుకోవడం, లేదా కోపంతో నాలుగు మాటలు అరిచేసి గొప్ప అనిపంచుకుందామని కంటెంట్ ఇద్దామని ప్లాన్ చేయడంతో కొంతమంది హౌస్ మేట్స్ బోల్తా కొట్టేస్తున్నారు.

రతిక పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఫైనల్ గా ప్రేక్షకులు తమ ఓట్లతో సమాధానం చెప్పారు, రతికని ఎలిమినేట్ చేశారు. సండే ఎపిసోడ్ లో రతిక ఎలిమినేష్ చాలా అనూహ్యంగా జరిగింది. యాక్టివిటీ రూమ్ లో గన్ పేల్చమని ఎవరి గన్ లో నుంచీ సౌండ్ వస్తుందో వాళ్లు సేఫ్ అని చెప్పాడు నాగార్జున. టేస్టీ తేజ, రతిక ఇద్దరూ ఒకేసారి గన్ పేల్చారు. రతిక ఎలిమినేట్ అయ్యింది. దీంతో పక్కనున్న టేస్టీ తేజ ఆశ్చర్యపోయాడు. నేను సేఫ్ అయ్యానా.. రతిక ఎలిమినేట్ అయ్యిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

అంతేకాదు, ఇదంతా చూస్తున్న హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కన్నీటితో వీడ్కోలు పలికారు. అలాగే రతిక కూడా చాలాసేపు బ్లాంక్ గా ఉండిపోయింది. తను ఎలిమినేట్ అయ్యానంటే నమ్మలేకపోయింది. వెళ్లిపోయేటపుడు కనీసం శివాజీకి బై అని కూడా చెప్పలేదు. ఈవిషయాన్ని శివాజీ పల్లవి ప్రశాంత్ తో షేర్ చేసుకున్నాడు. ఇక స్టేజ్ పైన నాగార్జునని పలకరించి తన జెర్నీని చూసుకుంది. చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ఎక్కడ బ్యాడ్ అయ్యిందో తనకి క్లియర్ గా అర్దమైపోయింది.

అయితే, లాస్ట్ మినిట్ వరకూ ఇది ఫేక్ ఎలిమినేషన్ అని, సీక్రెట్ రూమ్ లో పెడతారని అనుకుంది పాపం.. కానీ బిగ్ బాస్ అదేం లేకుండా ఇంటికి పంపించేశాడు. రతిక వెళ్లిపోతూ వెళ్లిపోతూ కొంతమంది హౌస్ మేట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చింది. ఈ సలహాలు ఇచ్చినపుడు హౌస్ మేట్స్ దానిని స్వీకరిస్తూ కరేలా షాట్స్ తాగాల్సి ఉంటుంది. ఇక్కడే శివాజీకి అందరితో ఉండమని కొంతమందితో మాట్లాడటం వల్లే నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావని అనుకుంటున్నారని చెప్పింది రతిక.

యావర్ ని కోపం తగ్గించుకోమని, ఎగ్రెషన్ అనేది కంట్రోల్ చేసుకోమని చెప్పింది. అలాగే తెలుగులో కూడా మాట్లాడమని చెప్పింది. సందీప్ కి సంచాలక్ గా ఫైయిల్ అయ్యావని ఈసారి అయినా డెసీషన్స్ బాగా తీస్కోమని సలహా ఇచ్చింది. శోభాశెట్టికి రెడీ అవ్వడానికి టైమ్ ఎక్కువ తీసుకుంటున్నావ్, టైమ్ తక్కువ తీస్కోమని సలహా చెప్పింది. అలాగే, శుభశ్రీని పిలిచి ఆడుకుంది. ఫస్ట్ షాట్ తాగమని తాగితే చెప్తానంది. తాగిన తర్వాత ఇదిగో ఇలాగే మోసపోతావ్.

ఎవరో ఏదో చెప్తారని అన్నీ చెప్పేయకు, ఏది పడితే అది చేయకు అంటూ తెలివిగా సలహా ఇచ్చింది రతిక. ఇక నాగార్జున ఎపిసోడ్ ఎండింగ్ లో హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఊహించనవి చాలా చాలా జరగబోతున్నాయని, గుర్తుపెట్టుకోమని చెప్పారు. రతికకి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఉల్టా పుల్టా అంటే ఇదే అంటూ ఆడియన్స్ కి కూడా చెప్పారు. లాస్ట్ వరకూ కూడా రతిక తను ఎలిమినేట్ అయ్యానని నమ్మలేకపోయింది. అదీ మేటర్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus