బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ అనేది ప్రారంభం అయ్యింది. దీనికోసం హౌస్ మేట్స్ నువ్వా నేనా అన్నట్లుగా టాస్క్ ఆడుతున్నారు. బిగ్ బాస్ ముందుగానే ఈ ఛాలెంజస్ ని మీతో ఆడించేందుకు గెస్ట్ లు వస్తారని చెప్పాడు. దీంతో ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారు హౌస్ మేట్స్. లాస్ట్ సీజన్ లో టాప్ – 5 లో నిలిచిన సిరి హన్మంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే అందరినీ పలకరించింది.
అంతేకాదు, తన ఫేవరెట్ టాస్క్ అండ్ ఫన్నీ టాస్క్ అయిన సౌండ్స్ సీక్వెన్స్ టాస్క్ ని ఆడించింది. బిగ్ బాస్ రకరకాల సౌండ్స్ ని పార్టిసిపెంట్స్ కి వినిపించాడు. ఒక్కొక్కరు కొన్ని సౌండ్స్ తప్పు రాయడం, సీక్వన్స్ తప్పు రాయడంతో ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈ టాస్క్ లో గెలిచిన వారికి ఒక మిస్టరీ బాక్స్ ఉంటుందని, అది నెగిటివ్ అవ్వొచ్చు, పాజిటివ్ అవ్వొచ్చు అని సిరి పార్టిసిపెంట్స్ ని ఊరించింది. ఫైనల్ గా బాబాభాస్కర్ ఈ మిస్టరీ బాక్స్ ని దక్కించుకున్నాడు.
టాస్క్ లో గెలిచిన మాస్టర్ మిస్టరీ బాక్స్ రాగానే ఈ బాక్స్ లో ఏమున్నా సరే, తనకోసమే వాడుకుంటానని క్లియర్ గా చెప్పాడు. ఇక గార్డెన్ ఏరియాలో మరో టాస్క్ ని పెట్టాడు బిగ్ బాస్. పార్టిసిపెంట్స్ గ్రూప్స్ గా విడిపోయి ఈ టాస్క్ ని ఆడారు. ఇందులో అఖిల్ సార్ధక్ అందరికంటే ఎక్కువగా 90 పాయింట్స్ సాధించాడు. బాబాభాస్కర్ 75 పాయింట్స్ సాధించారు. దీంతో అఖిల్ ఈ టాస్క్ లో విన్నర్ గా నిలిచాడు. అయితే, మిస్టరీ బాక్స్ ని ఓపెన్ చేయమని బిగ్ బాస్ బాబాకి చెప్పాడు.
మిస్టరీ బాక్స్ లో అనూహ్యంగా బాబాభాస్కర్ కి 50 పాయింట్స్ వచ్చాయి. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే 50 పాయింట్స్ తన ఖాతాలోకి రావడం వల్ల బాబాభాస్కర్ ఎవిక్షన్ పాస్ కోసం పాల్గొనే వాళ్లలో మొదటి పోటీదారుడు అయ్యాడు. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత బాబాభాస్కర్ కి చాలా ఈజీగా ఫినాలే రేస్ లోకి వెళ్లిపోయారని హౌస్ మేట్స్ అభిప్రాయపడ్డారు. చాలా ఈజీగా వచ్చినట్లుగా అయ్యిందని అన్నారు. అలాగే, అఖిల్ ఖాతాలో 90 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, మళ్లీ ఏదైనా టాస్క్ పెడితే మాత్రం ఖచ్చితంగా పాయింట్స్ తన ఖాతాలో కలుస్తాయి.
నిజానికి బాబాభాస్కర్ దగ్గర 75 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి టాస్క్ లో సెకండ్ బెస్ట్ ఉన్నాడు కాబట్టే మాస్టర్ పోటీదారులు అయ్యారు. ఒకవేళ తక్కువ పాయింట్స్ ఉండి ఉంటే, ఖచ్చితంగా అఖిల్ మొదటి పోటీదారుడు అయ్యేవాడు. బాబాభాస్కర్ గేమ్ లో ముందుకు వెళ్లగానే నెక్ట్స్ టాస్క్ ని సీరియస్ గా తీస్కోవాలని , గెస్ట్ లు వస్తే వాళ్లతో మాట్లాడుతూ మైమరిచిపోకూడదని అషూరెడ్డి అభిప్రాయపడింది. ఏది ఏమైనా ఈసారి సీజన్ లో ఫినాలే రేస్ లో ట్విస్ట్ లు ఉండబోతున్నాయనే అనిపిస్తోంది. మొత్తానికి అదీ మేటర్.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!