బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పుడు ఈ సారి రేటింగ్స్ అందుకోవడం కష్టమే అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా బిగ్ బాస్ ఈ సారి తీవ్రంగా నిరాశపరిచినట్లు కూడా కథనాలు ఎన్నో వచ్చాయి. నిజానికి మధ్యమధ్యలో రేటింగ్స్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ ఓట్లతోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సారి హౌజ్ లో కంటెస్టెంట్స్ మెల్లమెల్లగా వారి అభిమానుల సంఖ్యను పెంచుకున్నారనే చెప్పాలి.
ముఖ్యంగా టాప్ 7 కంటెస్టెంట్స్ కు దక్కిన క్రేజ్ గతంలో మరెవరికి దక్కలేదనే కామెంట్స్ వస్తున్నాయి. దేత్తడి హారిక, అభిజిత్ లకు కూడా భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయి. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి వచ్చిన మొత్తం ఓట్లు 15కోట్ల 55లక్షలు. గత ఏడాది కంటే కూడా ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక అప్పుడు 8కోట్ల వరకు ఓట్లు పడినట్లు నాగార్జున వివరణ ఇచ్చారు. ఈ సారి అంతకంటే ఎక్కువగా ఓట్లు పడడంతో బిగ్ బాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టాప్ కంటెస్టెంట్స్ లో ఎక్కువగా ఓట్లు అందుకున్న కంటెస్టెంట్ గా అభిజిత్ నిలవడంతో అతన్ని టైటిల్ విన్నర్ గా ప్రకటించారు.