Waltair Veerayya:చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేస్తారా…

‘పార్టీ ప్రెస్‌ మీట్‌’ పేరుతో ఆ మధ్య ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌ అంతా ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు గుర్తుందా? అందులో చిరంజీవి మాట్లాడుతూ ‘ఇదంతా చూస్తుంటే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అక్కర్లేదేమో అనిపిస్తోంది’ అని ఓ కామెంట్‌ చేశారు గుర్తుందా?. ఆ మాటలు ఆయన ఎందుకు అన్నారో కానీ.. పరిస్థితి చూస్తుంటే ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జరగడం అంత ఈజీ కాదు అని అనిపిస్తోంది. దానికి కారణం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం, దాని అనుమతులు కోసం ‘వీర సింహా రెడ్డి’ పడుతున్న, పడిన ఇబ్బందులే.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ శుక్రవారం సాయంత్రం ఒంగోలులో నిర్వహించాలని అనుకున్నారు. దీని కోసం 10 రోజులుగా శ్రేయాస్‌ మీడియా సంస్థ ప్రతినిధులు ఒంగోలులో అధికారులను కలుస్తూనే ఉన్నారు. తొలుత ఏబీఎం కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అధికారులు అక్కడ అనుమతి నిరాకరించారు. దాంతో ఆల్టర్నేటివ్‌గా త్రోవగుంట దగ్గరలోని బీఎంఆర్‌ అర్జున్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ స్థలంలో నిర్వహించేందుకు అనుమతి కోరారు. దానికి ఓకే చెప్పిన పోలీసులు ఆ తర్వాత ఇబ్బందులు పెట్టారట.

గురువారం రాత్రి వరకు ఆంక్షల పేరిట ఈవెంట్‌ టీమ్‌ను పోలీసులు ముప్పతిప్పలు పెట్టారు. పాసులపై స్టాంపింగ్‌ చేయాలంటూ స్వాధీనం చేసుకున్న పోలీసులు రాత్రి 10 గంటల వరకూ ఇవ్వలేదట. దీంతో విశాఖపట్నంలో ఈవెంట్‌ పెడదాం అనుకుంటున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు టాలీవుడ్‌ జనాలు. నిజానికి 8వ తేదీని వాల్తేరుకు వీరయ్య వెళ్లాల్సి ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఇంకా ఈవెంట్‌ వెన్యూ చెప్పలేదు.

ఈ లెక్కన అసలు ‘వీరయ్య’.. ‘వాల్తేరు’ వెళ్తాడా అనేది అర్థం కావడం లేదు. విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ పెట్టే అవకాశం లేకపోతే.. ప్రైవేటు స్థలంలో తక్కువ మంది అభిమానుల మధ్య నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు. చూద్దాం ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే రేపు ట్రైలర్‌తోపాటు వివరాలు బయటకు రావొచ్చు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus