Swathi: సాయితేజ్‌ – స్వాతి మధ్య ఏం జరుగుతోంది? ఆ ముక్క ఏంటి?

కలర్స్‌ స్వాతి, సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ అనే సింగిల్‌ ఆల్బమ్‌ సాంగ్‌లో నటించారు. ఆ పాట వచ్చింది, జనాల్లోకి వెళ్లిపోయింది. అయితే ‘మంత్‌ ఆఫ్‌ మధు’ అంటూ త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది స్వాతి. ఆమెతోపాటు ఈ మూవీలో చాలామంది నటులు ఉన్నారు అనుకోండి. అయితే ఈ సినిమా ప్రచారంలో ఎక్కువగా ఆమె గురించే చర్చ జరుగుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు వస్తున్నాయి, దానికి ఆమె నుండి చిరాకులు, పరాకులు కూడా వస్తున్నాయి.

స్వాతి (Swathi) పెళ్లి తర్వాతి పరిస్థితుల గురించే అదంతా అని మీకు తెలుసనుకోండి. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం ప్రశ్నల మధ్యలోకి మరో పాయింట్‌ వచ్చి పడింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా ముఖ్య అతిథిగా సాయిధరమ్‌ తేజ్‌ హాజరయ్యాడు. అప్పుడు రెండు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి ఓపెన్‌గా ప్రేక్షకుల ముందు ఇద్దరూ చెప్పేయగా, ఇంకొకటి చెవిలో మాట్లాడుకుని సస్పెన్స్‌ పెట్టేశారు. తేజు, స్వాతి డిగ్రీలో క్లాస్‌మేట్స్ అంట.

ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలు ఒకటే కావడంతో పరీక్షల్లో దగ్గర దగ్గర కూర్చునేవాళ్లని, తేజుకు స్వాతి పరీక్షల్లో సాయం చేసేదని చెప్పారు. మామూలుగానే సిగ్గులు, నవ్వులు ఎక్కువగా ఉండే తేజు… స్వాతి ఆ మాటలు చెబుతుండగా… ఇంకాస్త మెలికలు తిరిగిపోయాడు. కానీ స్టేజీ మీద వీళ్లు చూపించిన స్నేహం, ప్రేమ, అభిమానం అయితే అభిమానులకు ఫుల్‌ ఖుష్‌ అని చెప్పొచ్చు. అయితే తేజు తనకు చాలా పెద్ద సపోర్టు సిస్టమ్‌ అని స్వాతి తెగ పొగిడేసింది.

అయితే ఈ క్రమంలో తేజు వెనుక నుండి దగ్గరకు వచ్చి ‘ఆ మాట కూడా చెప్పేయొచ్చుగా’ అంటూ ఏదో అన్నాడు. దాని స్వాతి నవ్వేసి ఊరుకుంది. దీంతో ‘ఆ మాట’ ఏంటి అనే ప్రశ్న సోషల్‌ మీడియాలో మొదలైంది. దేని గురించి సాయిధరమ్‌ తేజ్‌ అన్నాడు. ఆ చెప్పాలి అనుకుని చెప్పకపోయిన మాట ఏంటి అనేది ప్రశ్న. చూద్దాం త్వరలో అయినా చెబుతారేమో.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus