బిగ్ బాస్ 4: ఫిజికల్ టాస్క్ కుమ్మేస్తాడా..?

బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ కి వారం వారం ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఎన్నిసార్లు నామినేట్ అయితే అంత బలంగా మారిపోతున్నాడు. లాస్ట్ టైమ్ అభిజిత్ ఎలిమినేట్ అయిపోతాడనే సోహైల్ , మెహబూబ్ అనుకున్నారు. కానీ , ప్రేక్షకులు ఓట్లు వేసి మరీ కాపాడారు. ఇక రీసంట్ గా జరిగిన 11వ వారం నామినేషన్స్ లో అఖిల్ తో సై అంటే సై అన్నాడు అభిజిత్. రోబో టాస్క్ తర్వాత నువ్వు ఎలాంటి టాస్క్ ఆడలేదు అన్నా కూడా కామ్ గా నిలుచుకున్నాడు. అయితే, ఆ తర్వాత అభిజిత్ చాలా టాస్క్ లలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. బిగ్ బాస్ సినిమా టాస్క్, కేర్ టేకర్ టాస్క్, రాక్షసులు మనుషులు టాస్క్, పల్లెకిపోదాం టాస్క్ ఇలా అన్ని టాస్క్ లలో తనకి స్కోప్ ఉన్నంతవరకూ బాగానే చేశాడు. కానీ, ఫిజికల్ టాస్క్ లో మాత్రం ఎప్పుడు సిద్ధం కాలేదనే చెప్పాలి.

కానీ, ఇప్పుడు అభిజిత్ కి ఈ ఛాన్స్ వచ్చేలాగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ లో భాగంగా కమాండెంట్ హౌస్ టాస్క్ లో అభిజిత్ పెర్ఫామెన్స్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు నెక్ట్స్ ఈ టాస్క్ లో గెలిచి కెప్టెన్సీ రేస్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అది అభిజిత్ కి ప్లస్ అవుతుంది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఎలాంటిది వచ్చినా కూడా కుమ్మేస్తాడు. ముఖ్యంగా ఈసారి ఫిజికల్ టాస్క్ సమరానికి కూడా సై అనేలాగానే ఉన్నాడు అభిజిత్. మరి ఈవారం ఎలాంటి టాస్క్ పడబోతోంది అనేది కూడా ఆసక్తికరం.


ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus