పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)..లకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. వీళ్ళ హైట్ కావచ్చు, హెయిర్ కట్ కావచ్చు.. చాలా అంటే చాలా సిమిలర్ గా ఉంటాయి. ఇంకో సిమిలారిటీ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ చేయాల్సిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ (Itlu Sravani Subramanyam) ‘ఇడియట్’ (Idiot) ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) ‘మిరపకాయ్’ (Mirapakay) వంటి సినిమాలు వదులుకోవడం.. అవి రవితేజ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టడం జరిగింది. ఇంకో విధంగా చెప్పాలంటే..
పవన్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాల వల్లే రవితేజ స్టార్ అయ్యాడు అనేది చాలా మంది నమ్మకం. ఇవన్నీ ఎలా ఉన్నా.. పవన్ కళ్యాణ్- రవితేజ..లది క్రేజీ కాంబో. వీరి కలయికలో సినిమా వస్తే ఫ్యాన్స్ కే కాదు యావత్ టాలీవుడ్ ప్రేక్షకులకి ఐ ఫీస్ట్..లా అనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి ఆ అవకాశం వచ్చి.. మిస్ అయినట్టు కూడా ఇన్సైడ్ టాక్. అవును నిజమే..! కొంచెం గతంలోకి వెళితే… మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘యువ’ (Yuva) అనే సినిమా రూపొందింది.
సూర్య (Suriya), సిద్దార్థ్ ( Siddharth), మాధవన్ (R.Madhavan)..ల కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. కానీ తెలుగులో పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమాలో సూర్య, సిద్దార్థ్..ల పాత్రల కోసం పవన్ కళ్యాణ్, రవితేజ..లని అనుకున్నాడట మణిరత్నం. ఇద్దరినీ కలిసి కథ కూడా చెప్పాడు. వాళ్ళకి నచ్చింది కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు.
దీంతో తమిళంలో సూర్య, సిద్దార్థ్, మాధవన్..లతో తెరకెక్కించాడు మణిరత్నం. ‘స్టూడెంట్స్ రాజకీయాల్లోకి వస్తే.. ఎలా ఉంటుంది’ అనే లైన్ తో రూపొందిన సినిమా ఇది. ‘యువ’ లో కొన్ని డైలాగులు బాగుంటాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కి ఆ డైలాగులు బాగా కలిసొచ్చేవేమో.