Mahesh Babu: సూపర్‌స్టార్‌ డబ్బే పరమావధి అనుకుంటాడా.. వెనక్కి తగ్గుతాడా?

సినిమా హీరోలను అభిమానులు, ప్రేక్షకులు బాగా ఫాలో అవుతారనే విషయం తెలిసిందే. గెటప్‌ల నుండి లుక్‌ల వరకు, డ్రెస్‌ల నుండి యాటిట్యూడ్‌ వరకు అన్నీ అనుసరించేస్తుంటారు. అందుకే హీరోలను తమ ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్‌లో చూపించాలనుకుంటాయి పెద్ద పెద్ద కంపెనీలు. వాటిని చూసి ప్రభావితమై తమ ఉత్పత్తులు కొంటారని వారి ఆలోచన. అయితే ఈ క్రమంలో ఆరోగ్యానికి చేటు చేసే ఉత్పత్తులకు ప్రచారం చేస్తే.. ఆ హీరోలు ఇబ్బందుల్లో పడతారు. ప్రస్తుతం ఇదే చర్చ దేశవ్యాప్తంగా మళ్లీ నడుస్తోంది.

Click Here To Watch NOW

పోగాకు ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన యాడ్‌లో నటించి, ప్రమోట్‌ చేసినందుకు ఇటీవల అక్షయ్‌ కుమార్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇక ఆ పని చేయాల్సిన నెక్స్ట్‌ హీరో మహేష్‌బాబునే అనేది సోషల్‌ మీడియా చర్చల సారాంశం. మౌత్‌ రిఫ్రెషనర్‌ పేరుతో ఓ సంస్థ అగ్ర హీరోలను పెట్టుకుని యాడ్స్‌ విడుదల చేస్తోంది. అందులో బాలీవుడ్‌ నుండి అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, షారుఖ్‌ ఖాన్‌ లాంటి వాళ్లు నటించారు. మన దగ్గర నుండి మహేష్‌ కనిపించాడు.

అయితే ప్రకటనల్లో మౌత్ రిఫ్రెషర్స్ మాదిరి చూపిస్తూ గుట్కాలను ప్రమోట్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చెబుతున్నది మౌత్‌ ఫ్రెష్‌నర్ అయినా.. సంస్థ పేరు వల్ల గుట్కాల ప్రచారం జరుగుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కొంతమంది స్టార్‌ హీరోలు ఆ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడానికి ముందుకు రాలేదు అంటారు. అలా అల్లు అర్జున్‌ కూడా యాడ్‌కి నిరాకరించని ఇటీవల చదువుకున్నాం. అయితే… ఇలాంటి యాడ్‌లో మహేష్‌ బాబు నటించడం ఇప్పుడు వేలు అతనివైపు తిరిగేలా చేశాయి.

మరి ఈ విషయంలో మహేష్‌ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు మహేష్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి హానికర బ్రాండుకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో శీతల పానీయాల్లో హానికారక పదార్థాలున్నాయని విమర్శలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి ఆ ప్రకటన నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus