బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ‘ఛత్రపతి’ సినిమా రీమేక్ చేస్తారని చాలా రోజుల క్రితం ప్రకటించారు. దాని కోసం శ్రీనివాస్ ముంబయి వెళ్లి కొద్ది రోజులు ఉన్నాడు కూడా. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి వార్తా లేదు. ఈలోగా ‘కర్ణన్’ సినిమా రీమేక్ పనుల్లో శ్రీనివాస్ బిజీగా ఉన్నాడని వార్తలొస్తున్నాయి. దీంతో బాలీవుడ్ ‘ఛత్రపతి’ ఆగిపోయినట్లే అని పుకార్లు మొదలయ్యాయి. సరిగ్గా ఈ సమయంలోనే బెల్లంకొండ టీమ్ ఒక ప్రెస్ నోట్ వదిలింది. అందులో పాయింటే ఇక్కడ ఇంట్రెస్టింగ్. అదేంటంటే…
‘హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి. వినాయక్, పెన్ స్టూడియోస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సెట్ దెబ్బతింది. అందుకే చిత్రీకరణ ఆలస్యం అవుతుంది’… ఇదీ టీమ్ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కీలక పాయింట్. అయితే ఈ పాయింట్ చదవగానే మొదట వచ్చే డౌట్ ‘నగరంలో అంత పెద్ద వర్షం పడిందా?’ అని. నగరంలో చిన్న వర్షం పడినా… జరిగే నష్టం గురించి టీవీ ఛానళ్లు చూపిస్తాయి. అంత పెద్ద వర్షం పడినట్లు ఎక్కడా చూపించలేదు. దీంతో సినిమా ఆలస్యానికి ఇది కారణమేనా అని నెటిజన్లు అనుకుంటున్నారు.
సినిమాకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రిలీజ్ చేసినప్పుడు కొత్త ఫొటోలు లేదా సంబంధిత ఫొటోలు విడుదల చేయడం పరిపాటి. అయితే ‘సెట్ పాడైపోయిన’ ప్రెస్‌నోట్‌తో పాత ఫొటో ఒకటి విడుదల చేశారు. దీంతో నిజమేంటి? అనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఏమన్నా… అసలు ఫొటోలు బయటకు తెస్తుందో, లేక సమాచారం అదే అని ఊరుకుంటుందో చూడాలి. నిజానికి ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను ఏప్రిల్ 22న మొదలు పెట్టాలనుకున్నారు. చిత్రబృందం చెబుతున్న ప్రకారం అయితే ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు అండ్ కో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు. సెట్ పనులు ఓ కొలిక్కి వచ్చాక షూటింగ్ ప్రారంభిస్తారట.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!