Ram Charan: బన్నీ పుట్టిన రోజు.. తారక్‌ వరుస ట్వీట్ల వెనుక అర్థం ఇదేనా?

రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ బావాబామ్మర్దులు అవుతారు. అయితే ఇద్దరూ అన్నదమ్ముల్లా పెరిగారు కాబట్టి.. అన్నదమ్ముల్లానే పిలుపులు ఉంటాయి. వీళ్ల రిలేషన్‌ అంతా కొత్తగా ఉంటుంది. అయితే ఇదంతా కొన్ని రోజుల క్రితం వరకే. ఎందుకంటే ఇద్దరూ స్టార్‌ హీరోలుగా ఎదిగే క్రమంలో ఏదో తేడా కొట్టేసింది అంటుంటారు. అప్పుడప్పుడు ఈ డౌట్‌ రావడానికి ఇద్దరి మధ్య ఉండాల్సిన మినిమమ్‌ కర్టసీ విషెష్‌ కూడా కనిపించవు. అయితే అదేం లేదు అంటూ అప్పుడప్పుడు కొన్ని ఉదాహరణలు వస్తుంటాయి.

అయితే వాటి కంటే అనుమానాలే ఎక్కువ అవుతున్నాయి. మొన్నీమధ్య అంటే మార్చి 27న (Ram Charan) రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్‌ నుండి ఎలాంటి విషెష్‌ రాలేదు. అయితే బన్నీ పుట్టిన రోజు నాడు మాత్రం చరణ్‌ నుండి విషెష్‌ వచ్చాయి. అయితే ఆ విషెష్‌లో లెక్కలు తప్పాయి అని కూడా అంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకుంటుండగానే ట్విటర్‌లో తారక్‌, బన్నీ మధ్య కాస్త ఫన్‌ జరిగింది. ‘బావ… బావ’ అని పిలుచుకునే చనువు ఉన్న బన్నీ – తారక్‌ అదే కోవలో మాట్లాడుకున్నారు.

పార్టీ లేదా బావా అంటూ తారక్‌ అడగడం, వచ్చేస్తున్నా అంటూ రిప్లై రావడం భలేగా అనిపించింది ఫ్యాన్స్‌కి. అయితే, మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సమయంలో బలంగా కనిపించిన, వింతగా వినిపించిన రామ్‌చరణ్‌ – తారక్‌ స్నేహం తగ్గుతోంది అనే పుకార్లు వస్తున్నాయి. ఈ మొత్తం కలిపి చూస్తే.. చరణ్‌  ఒకవైపు, తారక్‌ – అర్జున్ ఒకవైపు ఉన్నారనే చర్చ మొదలైంది. నిజానికి ఇలా అనుకోవడం కష్టం కానీ.. మాటలు, ట్వీట్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

అయితే ‘మేమంతా ఒకటే’ అని ఫైనల్‌గా వారి నుండి ట్వీట్లు రావొచ్చు, మాటలు రావొచ్చు. కానీ వారి చేష్టలు మాత్రం చర్చకు దారి తీశాయి. కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అని అల్లు అరవింద్‌ ఒకసారి అన్నట్లు గుర్తు. అయితే మరీ పుట్టిన రోజు నాడు విషెష్‌ కూడా చెప్పనంతగానా అంటే ఏమో అనే అనాలి. ఈ పుకార్ల షికార్ల విషయంలో ముగ్గురిలో ఎవరు క్లారిటీ ఇచ్చినా అద్భుతం అనే చెప్పాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus