ఈటీవీలో ప్రైమ్ టైమ్ అంటే.. రాత్రి 9 తర్వాతే అని అంటుంటారు ప్రేక్షకులు. కారణం 9 గంటలకు వచ్చే వార్తలు.. ఆ తర్వాత వచ్చే రియాలిటీ షోలు. 9 టు 11 వరకు వచ్చే స్లాట్‌లో ఈటీవీని కొట్టేవారు అని చెబుతుంటారు. అలాంటి స్లాట్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ వరుసగా ఆగుతున్నాయి. కొన్నింటి నుండి అట్రాక్షన్స్ దూరమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మార్పులు గమనిస్తే ఏం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇది ఈటీవీకి చెందిన విషయమే కావొచ్చు.. కానీ ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతోంది అని చెప్పాలి.
ఒకప్పుడు సోమవారం నుండి ఆదివారం వరకు.. ఆ తర్వాత సోమవారం నుండి శనివారం వరకు రియాలిటీ షోలు రన్ అవుతున్నాయి. అయితే వాటిలో ఆసక్తికర అంశాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ‘జబర్దస్త్’లో కాస్త ఫేమ్ సంపాదించుకున్న కమెడియన్స్ వివిధ కారణాల వల్ల బయటకు వెళ్లిపోయారు. ఒకరిద్దరు మళ్లీ వెనక్కి వచ్చినా.. అప్పటి కిక్ రావడం లేదు. అందులోని జడ్జిలు నాగబాబు, రోజూ కూడా వెళ్లిపోయారు. కొత్త జడ్జిల్లో ఇంద్రజ ఒక్కరే పర్మినెంట్‌గా కనిపిస్తున్నారు. ‘ఢీ’ విషయానికొస్తే డ్యాన్స్‌లు కంటే కామెడీ ఎక్కువైపోయిందనే కామెంట్లు వినిపించాయి.
ప్రతి సోమవారం ‘ఆలీతో సరదాగా’ అంటూ ఇంటర్వ్యూలు చేసే అలీ.. ఇటీవల షోను స్టాప్ చేశారు. త్వరలో వస్తాం అని చెప్పారు అనుకోండి. అయితే మరి సోమవారాన్ని ఏ షోతో ఫిల్ చేస్తారో చూడాలి. ‘వావ్’ ముగించేసి ఇంకో కార్యక్రమం తెచ్చారు. దాని రెస్పాన్స్ గురించి మనం మాట్లాడకూడదు. ఇక ‘ఢీ’ కొత్త సీజన్ ఓంకార్ షో కాన్సెప్ట్‌లో తీసుకొచ్చారు. ఇంకా దాని ఎఫెక్ట్ గురించి మాట్లాడాలంటే కాస్త టైమ్ పడుతుంది. తాజాగా ‘క్యాష్’ షోను ఆపేస్తున్నట్లు సుమ ప్రకటించారు. దీంతో ఇలా వరుసగా ఎందుకు ఈటీవీని వీడుతున్నారు అనే ప్రశ్న మొదలైంది.
మామూలుగా అయితే ‘ఆలీతో సరదాగా’ ఆపేస్తే.. ఆయనే ఓ గేమ్ షో చేసేవారు. ఇక ‘క్యాష్’ ఆపేస్తే ‘జీన్స్’ చేసేవారు సుమ. కానీ ఇప్పుడు ఆ అనౌన్స్‌మెంట్‌లు ఏమీ రాలేదు. ఇక సుధీర్ వస్తాను అంటున్నా.. ఇంకా గేట్లు తెరవలేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి సమ్‌థింగ్ హ్యాపెనింగ్.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?