Puri Jagannadh: పూరి నెక్స్ట్‌ సినిమా ప్లానింగ్‌ ఏంటి?

‘లైగర్‌’ అయిపోయింది.. ‘జేజీఎం’ ఉంటుందో లేదో తెలియదు. మరి నెక్స్ట్‌ ఏంటి?.. పూరి జగన్నాథ్‌ గురించి ఎక్కడ విన్నా ఇదే డిస్కషన్‌. ఎందుకంటే పూరి ఏ విషయంలో స్లోగా ఉండరు. స్లోగా చేసిన ‘లైగర్‌’ దారుణమైన దెబ్బ కొట్టింది. అలాగే దెబ్బ తగిలితే అక్కడ కూర్చుండిపోవడం ఆయన నైజం కాదు. కాబట్టి నెక్స్ట్‌ సినిమా కోసం ఆయన ప్రయత్నాలు అప్పుడే షురూ చేసి ఉంటారు అని అంటున్నారు అభిమానులు. చేతల్లో కాకపోయినా మనసులో ఆలోచనలు మొదలై ఉంటాయి అనేది వారి నమ్మకం.

‘జేజీఎం’ అలియాస్‌ ‘జన గణ మన’ సినిమా ఉందా లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఓవైపు ఉండదు అని గట్టిగా వార్తలొస్తుంటే, మరోవైపు రిప్‌ రూమర్స్‌ అంటూ ఛార్మి పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు ఆ సినిమాను మరచిపోండి.. వేరే పని చూసుకోండి అని విజయ్‌ దేవరకొండ అంటున్నాడు. దీంతో పూరి జగన్నాథ్‌ దగ్గర ఉన్న ఆప్షన్‌లు ఏంటి అనే ఓ చర్చ మొదలైంది. వాటి ప్రకారం చూస్తే పూరి కొత్త సినిమా మొదలవ్వాలంటే ఇట్లో ఉన్న హీరోతోనే సాధ్యం.

‘లైగర్‌’ సినిమాకొచ్చిన ఊపు, ప్రచారం, హైప్‌ వల్లనో, లేక ఇంకేదైనా కారణమో కానీ.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు, కుర్ర హీరోలకు సినిమా పాయింట్లు చెప్పి ఓకే చేయించుకున్నారు పూరి. వారిలో సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ లాంటివాళ్లు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్లంతా పూరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది చూడాలి. ఒకవేళ వాళ్లు ఎవరూ ముందుకు రాకపోతే.. టాలీవుడ్‌లోకి వచ్చేయాల్సిందే.

ఇక టాలీవుడ్‌లో చూస్తే.. పరిస్థితి ఏమంత ఈజీగా లేదు. స్టార్‌ హీరోలంతా దాదాపు రెండేసి సినిమాలు చేతిలో పట్టుకుని ఉన్నారు. కొందరైతే మూడు, నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు. దీంతో పూరికి సినిమా కావాలి అంటే ఆకాశ్‌ పూరితోనే చేయాలి. మరి ఆ దిశగా ఆలోచిస్తాడో లేదంటే వేరే ఎవరైనా హీరోను పట్టుకుంటాడా అనేది చూడాలి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌ 2’ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి దాని సంగతి ముందుకు తెస్తారేమో చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus