Allu Arjun, Sandeep: ఆ లెక్కలు కరెక్ట్‌ అయితే అల్లు అర్జున్‌ – సందీప్‌ సినిమా… ఎప్పుడు రావొచ్చంటే?

సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ సినిమాతో ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో నెక్స్ట్‌ఏంటి అనే చర్చ మొదలైంది. దీనికి ఆన్సర్‌ అందరికీ తెలిసిందే. అదే ‘స్పిరిట్‌’. ప్రభాస్‌తో చేయనున్న ఈ సినిమా గురించి త్వరలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. ఈ విషయం పక్కనపెడితే ఆ తర్వాతి సినిమా కచ్చితంగా అల్లు అర్జున్‌ది అవుతుంది అని ఆ మధ్య అనుకున్నారు. బన్నీ ప్లానింగ్‌ అదిరిపోయిందని అని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌ సమాచారం ప్రకారం లెక్క వేరే ఉంది.

మొన్నీ మధ్య ‘యానిమల్‌’ సినిమా నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఓ ట్వీట్‌ చేశారు. అందులో సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్‌ సినిమాలు ఏంటి అనే చెప్పేశారు. దీంతో అల్లు అర్జున్‌ సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆ లిస్ట్‌ ప్రకారం అయితే అల్లు అర్జున్‌ సినిమాకు ముందు సందీప్‌ రెడ్డి వంగా రెండు సినిమాలు చేయాల్సి ఉంది. అవి కూడా రెండు పెద్ద సినిమాలు. దీంతో బన్నీ సినిమా సెట్స్‌ మీదకు రావడానికి కనీసం నాలుగేళ్లు పడుతుంది అంటున్నారు.

కావాలంటే మీరే లెక్క చూడండి అర్థమైపోతుంది. ప్రస్తుతం ‘యానిమల్‌’ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేసే పనిలో ఉన్నారు సందీప్‌ రెడ్డి వంగా. కొన్ని నెలల తర్వాత ‘స్పిరిట్‌’ సినిమా పనులు ప్రారంభిస్తారట. అది కూడా వచ్చే ఏడాది ఆఖరులో షూటింగ్‌ ప్రారంభిస్తారట. అంటే 2025 ఆఖరులో కానీ, 2026 ప్రథమార్ధంలో ఈ సినిమా రావొచ్చు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ తీసుకొని ‘యానిమల్‌ పార్క్‌’ సినిమా పనులు మొదలుపెడతారు సందీప్‌ రెడ్డి వంగా. అంటే ఆ సినిమా 2027లో ప్రారంభం అయినా… 2028లో వస్తుంది.

అలా బన్నీ(Allu Arjun) సినిమా మొదలుకావడానికి 2028 కానీ, 2029 కానీ అవుతుంది. దీంతో ఈ సినిమా సెట్స్‌ మీదకు వచ్చినంతవరకు వెయిట్‌ చేయకుండా మరికొన్ని సినిమాలు ఓకే చేయాల్సి ఉంటుంది. అయితే త్రివిక్రమ్‌ సినిమా మొదలు, పూర్తి, రిలీజ్‌కు చాలా సమయమే తీసుకుంటారు అని టాక్‌. పాన్‌ ఇండియా రేంజిలో నెవర్‌ బిఫోర్‌ కాన్సెప్ట్‌లో ఆ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ లెక్కన సందీప్‌ సినిమా వరకు త్రివిక్రమ్‌ సినిమా ఉండే అవకాశమూ ఉంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus