Balakrishna: తారకరత్న పోయిన బాధ నుండి బాలయ్య ఇంకా కోలుకోలేదా?

నందమూరి ఫ్యామిలీలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.నందమూరి మోహనకృష్ణ గారి అబ్బాయి తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఫిబ్రవరి 18న శివరాత్రి పండుగ రోజున తారకరత్న కన్నుమూశారు. జనవరి 27న తారకరత్నకి గుండెపోటు వచ్చింది. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకి కుప్పంలో గుండెపోటు రాగా.. వెంటనే సిబ్బంది ఆయన్ని కేసి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోవడంతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

అక్కడి వైద్యులు తారకరత్నకి మెరుగైన వైద్యం అందించి బ్రతికించాలని ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నం ఫలించలేదు. తారకరత్న మరణం ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరీ ముఖ్యంగా బాలయ్యని నిద్ర లేకుండా చేస్తుంది. తారకరత్న ట్రీట్మెంట్ కోసం బాలయ్య షూటింగ్లకు ఆబ్సెంట్ అయ్యాడు. నిర్మాతలు అతనికి ఫోన్ చేస్తే మిగిలిన స్టాఫ్ తో షూటింగ్ చేసుకోమని, దయచేసి డిస్టర్బ్ చేయొద్దని సున్నితంగా మందలించాడు. అయితే తారకరత్న చనిపోయి వారం అయ్యింది.

బాలయ్యని షూటింగ్ కు రమ్మని అడగడానికి నిర్మాతలకు ధైర్యం సరిపోవడం లేదు. అయితే విషయం తెలుసుకున్న బాలయ్య మార్చ్ 4 నుండి షూటింగ్ కు హాజరవుతానని తెలియజేశారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 108వ సినిమాని షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుండగా..

శ్రీలీల.. బాలయ్యకి కూతురి పాత్రలో కనిపించనుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడి అలరించనున్నాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus