ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయిన సాయితేజ్‌ – వైష్ణవ్‌ తేజ్‌.. ఏమైంది?

వారసత్వం.. నెపోటిజం.. బంధుప్రీతి.. ఇలా పేరేదైనా కావొచ్చు అంతో కొంతో మంచి సినిమాలు చేస్తున్న వారసత్వం హీరోల మీద ఏవో ఒకటి కామెంట్‌ చేస్తూనే ఉంటారు నెటిజన్లు. టాలెంట్ ఉంటేనే వారసత్వం కాపు కాస్తుంది కానీ.. ఒరిజినల్‌గా టాలెంట్‌ లేకపోతే ఉపయోగం లేదు అని చెబితే ఒప్పుకోరు. మిగిలిన సినిమా పరిశ్రమలు ఏమో కానీ.. మన దగ్గర వారసులు చాలా మంది సరైన సినిమాలు లేక, కెరీర్‌ను రైట్‌ రూట్‌లోకి పెట్టలేకపోతున్నారు.

ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకొచ్చింది చర్చకు అంటే.. ఓ పెద్ద సినిమా కుటుంబం నుండి వారసత్వంలో ఇండస్ట్రీలోకి వచ్చిన ఇద్దరు హీరోల పరిస్థితి ఇప్పుడు ఈ చర్చకు దారితీసింది. అలా అని పూర్తిగా సినిమాలు లేకుండా పోయారా అంటే లేదని చెప్పాలి. కానీ అంత సాఫీగా ఏమీ లేదు అని అంటున్నారు. వాళ్లే సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej)  , వైష్ణవ్‌తేజ్‌(Panja Vaisshnav Tej) . వాళ్లిద్దరికేమైంది మంచి సినిమాలే చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు.

ఇక్కడే చిన్న పాజ్‌ ఇవ్వాల్సి వస్తుంది. అదే ‘గతేడాది వరకు’ అని. ఎందుకంటే 2024 సగం పూర్తవ్వడానికి గట్టిగా 40 రోజులు లేవు. అంటే ఐదు నెలలు పూర్తవుతున్నాయి. కానీ ఈ ఇద్దరి సినిమాల లెక్క ఇంకా తేలడం లేదు. ‘ఆదికేశవ’ (Aadikeshava) సినిమా తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ నుండి మరో సినిమా రాలేదు. అలాగే కొత్త సినిమా ప్రారంభం కూడా కాలేదు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ అయితే ‘విరూపాక్ష’తో  (Virupaksha)  విజయం అందుకున్నా.. ‘బ్రో’ (BRO) ఇబ్బందిపడ్డాడు.

ఆ తర్వాత ‘గాంజా శంకర్‌’ అంటూ ఓ సినిమా స్టార్ట్‌ అయితే చేశాడు సాయి తేజ్‌. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆ సినిమా షెడ్యూల్స్‌ ఏవీ అవ్వడం లేదు. అలా అని సినిమా ఆగిపోయింది అని కూడా చెప్పడం లేదు. దీంతో ‘తేజ్‌ బ్రదర్స్‌ ఎక్కడ? ఏ సినిమా చేస్తారు?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమన్నా ఆన్సర్‌ త్వరలో వస్తుందేమో. ఇక్కడ ఆన్సర్‌ అంటే సినిమా ప్రకటనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus