Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ ఏ సీక్వెల్ కు ఓకే చెబుతారో?

స్టార్ హీరో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. బాలయ్య బోయపాటి కాంబో సినిమాలు క్రిటిక్స్ రివ్యూలతో పని లేకుండా భారీగా కలెక్షన్లు సాధిస్తాయి. ఈ కాంబోలో సినిమా అంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. అయితే మరికొన్ని నెలల్లో ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. సింహా2, లెజెండ్2, అఖండ2 సినిమాలలో ఏదో ఒక సినిమా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఎక్కువమంది ప్రేక్షకులు లెజెండ్2 లేదా అఖండ2 తెరకెక్కితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. సింహా2 తీయడానికి అవకాశాలు దాదాపుగా లేవని చెబుతున్నారు. మరోవైపు ఈ క్రేజీ కాంబోలో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాబితాలో స్టార్ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. బాలయ్య లెజెండ్2 పై ఆసక్తి చూపిస్తుండగా బోయపాటి శ్రీనుకు అఖండ2 పై ఆసక్తి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో లెజెండ్2 దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య బోయపాటి కాంబో మూవీ 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ ఏ రేంజ్ లో రికార్డులు చేయనుందో చూడాల్సి ఉంది. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 16 కోట్ల రూపాయల రేంజ్ లో బాలయ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

తర్వాత ప్రాజెక్ట్ లకు బాలయ్య పారితోషికం 20 కోట్ల రూపాయలకు చేరే అవకాశం అయితే ఉంది. బాలయ్య పారితోషికంతో పాటు ఆయన రేంజ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus